సామ్.. వ్వాటే స్టన్నింగ్ లుక్
ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా కూడా గ్లామర్ విషయంలో మాత్రం సీనియర్ బ్యూటీలతో పోటీ పడలేకపోతున్నారు
ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా కూడా గ్లామర్ విషయంలో మాత్రం సీనియర్ బ్యూటీలతో పోటీ పడలేకపోతున్నారు. ఇక సీనియర్స్ లో ఇప్పుడు ఎక్కువ స్థాయిలో మంచి గ్లామరస్ బ్యూటీగా క్రేజ్ అందుకుంటుంది సమంత. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమా అవకాశాలు అందుకుంటున్న సమంత వీలైనంతవరకు ఎక్కువగా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తోంది.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఆమె చాలా దూరంగా ఉంటుంది. రెమ్యునరేషన్ కోసం కూడా పెద్దగా ఆలోచించడం లేదు. ఒక విధంగా ఆమె కెరీర్ కు కూడా ఇది మంచి ఉపయోగమే అని చెప్పవచ్చు. అయితే సమంత సోషల్ మీడియాలో కూడా తన క్రేజ్ ను మెల్లమెల్లగా మరింత పెంచుకుంటుంది. మూడు పదుల వయసులో కూడా అమ్మడు 20 ఏళ్ల మోడల్ తరహాలో గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తోంది.
ఇక రీసెంట్ స్టైలిష్ గ్లామరస్ డ్రెస్ లో సమంత కనిపించిన విధానం స్టన్నింగ్ అనిపించేలా ఉంది. గతంలో ఇంతకంటే ఘాటైన డ్రెస్సులో కూడా దర్శనం ఇచ్చిన సమంత ఈ లుక్ లో మాత్రం చాలా అందంగా ఉంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది విజయ్ దేవరకొండ తో ఖుషీ అనే సినిమా చేసింది.
అంతకుముందు యశోద అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. కానీ గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఇక ఖుషి సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం అయితే బాలీవుడ్ లోనే సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
అలాగే సమంత మరో రెండు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుల విషయంలో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీలైనంతవరకు రెగ్యులర్ రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేయకూడదని సమంత నిర్ణయం తీసుకుంది. చాలా పవర్ ఫుల్ కథలు కథలలో తన పాత్రకు బలమైన ప్రాధాన్యత ఉండేలా కూడా ఆమె సినిమాలు సెలెక్ట్ చేసుకుంటొంది. మరి ఈ తరహా ప్రణాళికతో సమంత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ లను అందుకుంటుందో చూడాలి.