స‌మంత లైఫ్ జ‌ర్నీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కొంద‌రు వ్య‌క్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతారు. కానీ స‌మంత విష‌యంలో మాత్రం అంతా ఓపెన్ బుక్ లాగే క‌నిపిస్తుంది

Update: 2024-03-19 06:14 GMT

వృత్తి..వ్య‌క్తిగ‌త విష‌యాల్లో స‌మంత‌ని ప్రేక్ష‌కులు ఎంతో ద‌గ్గ‌ర‌గా చూసారు. న‌టిగా ఆమె ప్ర‌యాణం ఎప్పుడు మొద‌లైంది? ఎలా మొద‌లైంది? అటుపై ఆ జ‌ర్నీ ఎలా సాగింది? నాగచైత్య‌తో వివాహం.. విడాకులు. ఇలా సమంత ప్ర‌తీ ద‌శ‌ని ప్రేక్ష‌కుల‌కు అతి ద‌గ్గ‌ర‌గానే చూసారు. ఆమె ఓ హీరోయిన్ కావ‌డంతోనే ఇదంతా సాద్య‌మైంది? అంటే ! హీరోయిన్లు అంద‌రి విష‌యంలోనూ ఇన్ని విష‌యాలు తెలియ‌దు.

కొంద‌రు వ్య‌క్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతారు. కానీ స‌మంత విష‌యంలో మాత్రం అంతా ఓపెన్ బుక్ లాగే క‌నిపిస్తుంది. త‌న జీవితంలో ఏం జ‌రిగింద‌న్న‌ది ప్ర‌తీ విష‌యాన్ని రివీల్ చేస్తుంది. ద‌శాబ్దం దాటిన ప్ర‌యాణంలో తెలుగు ఆడియ‌న్స్ తో ఆమె ఎంతో ద‌గ్గ‌ర‌గా క‌నెక్ట్ అవ్వ‌డంతోనే అంత ఓపెన్ గా ఉండ‌ గల్గుతుంది. ఇక మ‌యోసైటిస్ బారిన ప‌డిన త‌ర్వాత ఆమె ఎంత‌గా ఇబ్బంది ప‌డిందో కూడా ప్రేక్ష‌కుల‌కు తెలిసిందే.

అనారోగ్యాన్ని సైతం లెక్క చేయ‌కుండా షూటింగ్ ల‌కు హాజ‌రైంది. మ‌ళ్లీ ఇప్పుడు కొంత గ్యాప్ అనంత‌రం కంబ్యాక్ అవ్వ‌డానికి రెడీ అవుతోంది. మ‌రి ఈ మొత్తం ప్ర‌యాణం ఎలా ఉంది? అనే ఓ ఇంట్రెస్టింగ్ క్వ‌శ్చ‌న్ స‌మంత ముందుకెళ్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. 'జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాను. ఎత్తు ప‌ల్లాలు చూసాను. ఓసారి సంతోషం క‌లిగితే మ‌రోసారి బాధ‌..దుఖం క‌లిగాయి.

నా జీవితంలో కూడా మంచి ..చెండు రెండు ఉన్నాయి. విధి నా పట్ల దయగా ఉంది. ప్రజలు నా పట్ల దయ చూపారు. వాళ్లు నా ప‌ట్ల చూపిన కృత‌జ్ఞ‌తా భావాన్ని తిరిగి ఇవ్వాల్సిన బాధ్య‌త నాపై అంతే ఉంది. ఇన్నిర కాల అనుభ‌వాలు ఎదురైన త‌ర్వాత నాకు తెలియ‌ని ఎన్నో విష‌యాలు తెలిసాయి. క‌ష్ట స‌మ‌యం లో కూడా కృత‌జ్ఞ‌త‌ను చూపించడం అన్న‌ది ఎంతో గొప్ప విష‌యం. ఇక‌పై జీవిత ప్ర‌యాణంలో ఏదైనా మార్పు ఉంటుందా? అంటే ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని..మునుప‌టి లాగే ముందుకు కొన‌సాగుతాన‌ని' తెలిపింది.

Tags:    

Similar News