ముంబైలో సమంత ఎందుకీ టెన్ష‌న్‌?

స‌మంత రూత్ ప్రభు(37) తన వృత్తిపరమైన క‌మిట్ మెంట్ల‌తో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల‌ హైద‌రాబాద్ టు ముంబై ప్ర‌యాణాలు రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌వే

Update: 2024-08-17 15:45 GMT

స‌మంత రూత్ ప్రభు(37) తన వృత్తిపరమైన క‌మిట్ మెంట్ల‌తో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల‌ హైద‌రాబాద్ టు ముంబై ప్ర‌యాణాలు రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌వే. సిటాడెల్ - హ‌నీ బ‌న్నీ త్వ‌ర‌లో స్ట్రీమింగుకి రెడీ అవుతుండ‌గా స‌మంత త‌ర‌చుగా ముంబై విజిట్స్ కి వెళుతోంది. ఇంత‌కుముందే ర‌క్త బ్ర‌హ్మాండ్ అనే హిందీ వెబ్ సిరీస్ కి సంత‌కం చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా సమంత ముంబైలో అడుగు పెట్టిన‌ప్ప‌టి ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. ముంబైలో త‌న కార్ లో వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. కార్‌లో వెళుతూ సామ్ ఫోన్‌ మాట్లాడుతూ కనిపించింది. బూడిదరంగు టీ-షర్ట్ వైట్ గళ్ల చొక్కాలో సాధారణంగా కనిపించింది. చేతి వేలికి ఆకుపచ్చ సింగిల్-స్టోన్ రింగ్‌ని కూడా ధరించింది. మేకప్ లెస్ లుక్‌లో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. సామ్ క్యాజువ‌ల్ లుక్ పై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. స‌మంత సింపుల్ గా క‌నిపిస్తోంది.. అదే స‌మ‌యంలో యూనిక్ గా నేచుర‌ల్ గా ఉందంటూ ప్ర‌శంసిస్తున్నారు. మ‌రో అభిమాని ముంబైలో అడుగుపెడుతూ సమంత‌లో టెన్ష‌న్ దేనికి? అని ప్ర‌శ్నించాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

స‌మంత ఫోక‌స్ ప్ర‌స్తుతం హిందీ ప‌రిశ్ర‌మ‌పైనే ఉంది. అక్కడ వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట‌య్యేందుకు సిద్ధంగా ఉంది. మ‌రోవైపు తెలుగు, త‌మిళంలోను పెద్ద ఆఫ‌ర్ల‌ను బ్యాలెన్స్ చేయాల‌నేది త‌న ప్లాన్. అయితే స‌మంత నుంచి త‌దుప‌రి పెద్ద ప్ర‌క‌ట‌న ఇంకా రావాల్సి ఉంది. బాలీవుడ్ అగ్ర హీరోల‌తో సినిమాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు ఇంకా రాలేదు.

ఇటీవ‌ల తుంబాద్ ద‌ర్శ‌కుడు రాహి అనీల్ బార్వే రూపొందించ‌నున్న తాజా వెబ్ సిరీస్ కి క‌మిటైన‌ సంగ‌తి తెలిసిందే. ర‌క్త్ బ్ర‌హ్మాండ్-అనేది టైటిల్. టైటిల్ కి త‌గ్గ‌ట్టే క‌థాంశం ఉత్కంఠ క‌లిగిస్తుంద‌ని చెబుతున్నారు. అభిమానం, కుట్రలు, ప్రేమ, త్యాగం, విధి ఆట‌లు ఇవ‌న్నీ సిరీస్ లో ఉత్కంఠను క‌లిగించ‌నున్నాయి. ఒక ప్ర‌త్యేక‌మైన ర‌హ‌స్య ప్ర‌పంచంలోకి ఆడియెన్ ని తీసుకెళ్లేందుకు క్ష‌ణ‌క్ష‌ణం టెన్ష‌న్ ను క్రియేట్ చేసే సిరీస్ ఇది అని చెబుతున్నారు. అయితే ఈ సిరీస్ లో స‌మంత పాత్ర ఎలా ఉంటుందో మాత్రం ద‌ర్శ‌కుడు ఇంకా రివీల్ చేయ‌లేదు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి ఇత‌ర పాత్రధారులు. రాజ్ అండ్ DK క్రియేటివ్ పార్ట్ లో ఉన్నారు. నిర్మాత‌లుగా కొన‌సాగుతారు. ఫ్యామిలీమ్యాన్ 2, సిటాడెల్: హనీ బన్నీ త‌ర్వాత రాజ్ అండ్ డీకేతో స‌మంత‌కు మూడో ప్రాజెక్ట్ ఇది. మ‌రోవైపు స‌మంత సొంత బ్యాన‌ర్ లో `బంగారం` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News