ఇప్పుడు మరింత బలంగా ఉన్నా: సమంత
అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు జంటగా తొలిసారి నటించిన చిత్రం ‘ఏమాయ చేశావే’
సోషల్ మీడియాలో ఎక్కువగా స్పెషల్ ఫొటోస్ తో ఆకట్టుకునే సమంత అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే తన ఆరోగ్య పరిస్థితి పై కూడా ఆమె కొన్ని సార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. విడాకుల అనంతరం సమంత ఎక్కువగా అత్యాద్మీక జీవితం వైపు ఫోకస్ చేస్తున్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక వివరణ హాట్ టాపిక్ గా మారింది.
అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు జంటగా తొలిసారి నటించిన చిత్రం ‘ఏమాయ చేశావే’. ఆ మూవీతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఈ చిత్రం విజయం సాధించడంతో, ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మనం, అలాగే ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలో కూడా కలిసి నటించారు, ఇక ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంట, అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత, సమంత అనారోగ్యంతో బాధపడింది. మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతూ, సినిమా రంగానికి బ్రేక్ ఇచ్చింది. ఈ సమయంలో ఆమె తన ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు రకరకాల మార్గాలను అన్వేషించింది. జిమ్లో కసరత్తులు చేస్తూ, యోగాసనాలు చేస్తూ తన శక్తిని పునరుద్ధరించేందుకు ప్రయత్నించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో, సమంత తన ఇన్ డైరెక్ట్ గా విడాకులు మరియు మయోసైటిస్ అనుభవాల గురించి చెప్పింది. “జీవితంలో కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. కానీ, విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది. విశ్వాసం మనకు ప్రశాంతతని ఇస్తుంది. గత మూడు సంవత్సరాలు నాకు కష్టమైనా, ఇప్పుడు నేను మరింత బలంగా ఉన్నాను. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను” అని సమంత తెలిపింది.
“ఇప్పుడున్న బలం నాకు ఆధ్యాత్మిక చింతన నుండి వచ్చింది” అని ఆమె అభిప్రాయపడింది. “ఆధ్యాత్మికత నా జీవితంలోని అన్ని విషయాలను ప్రభావితం చేస్తుంది. సంఘర్షణలు, అవగాహనలు నాకు నేర్పినవి. ఆధ్మాత్మికత నాకు అవసరమైన బలంగా మారింది. ఆధ్మాత్మికత అంతులేని శక్తిగా ఉందని నేను నమ్ముతాను” అని సమంత పేర్కొంది.
2017 అక్టోబర్లో నాగ చైతన్యతో వివాహం చేసుకున్న సమంత, 2021 అక్టోబర్లో విడాకులు తీసుకుంది. ఆ అనుభవం ఆమెను మరింత బలంగా మార్చింది. ప్రస్తుతం, సమంత తన ఆరోగ్యం మీద దృష్టి పెట్టి, సినిమాలలో నటన కొనసాగిస్తూ, తన కెరీర్ని ముందుకు తీసుకెళ్తోంది.