ఫోటో స్టోరి: వెన్నుపోటు పొడిచేస్తారు జాగ్రత్త!
యుద్ధంలో వెన్ను చూపకూడదు. పిరికిపందలా పారిపోకూడదు. చావో రేవో తేల్చుకోవాలి!! అప్పుడే గౌరవం గుర్తింపు
యుద్ధంలో వెన్ను చూపకూడదు. పిరికిపందలా పారిపోకూడదు. చావో రేవో తేల్చుకోవాలి!! అప్పుడే గౌరవం గుర్తింపు. రాజకీయాల్లోను వెన్ను చూపడం అంత మంచిది కాదు. నమ్మినోళ్లు నట్టేట ముంచేస్తారు!
ఇన్ని విషయాలు తెలిసి కూడా సమంత ఏంటి ఇలా చేస్తోంది? ఏంటి ఇలా వెన్ను చూపిస్తోంది? అయితే ఫిట్ నెస్ అనేది రాజకీయం కాదు... యుద్ధం.. ఇక్కడ చాలా కాలంగా వార్ నడిపించేస్తోంది సమంత. ఆదివారాలు కూడా కనికరం అన్నదే లేకుండా జిమ్ లో శ్రమిస్తోంది. ఫిట్ నెస్ కోసం యుద్ధమే చేస్తోంది. అయితే ఇప్పుడు ఇలా వెన్ను చూపించడానికి కారణం తన అభిమానులు స్ఫూర్తి పొందాలనే తపనతోనే ..
మయోసైటిస్ లాంటి ప్రమాదకర రుగ్మతను ఎదురించిన సమంతకు క్రమశిక్షణ ఎంతగానో సహకరించింది. సమయానుకూలంగా కసరత్తులు, యోగా-ధ్యానంతో చాలా వరకూ అనారోగ్యం నుంచి బయటపడింది. ఇది అందరికీ స్ఫూర్తి దాయకమైన ప్రయాణం. ఇప్పుడు పూర్తి ఫిట్ గా ఉంది. తన పాత రూపానికి సామ్ షిఫ్టయింది. ఇటీవల వరుసగా వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్న సమంత తనకంటే చాలా మంది టీనేజీ తరం హీరోయిన్లకు మళ్లీ సవాల్ విసరబోతోంది.
మయోసిటిస్ నుండి కోలుకున్న తర్వాత సమంతా కొత్త ప్రాజెక్ట్‌లకు సంతకం చేయలేదు. పూర్తి ఫిట్ లుక్ కోసం చాలా ప్రయత్నించింది. దానికోసం గ్యాప్ తీస్కుంది. ఈ వ్యూహం బాగానే వర్కవుటైందనడానికి తాజాగా సామ్ షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ ఒక ఉదాహరణ. ప్రస్తుతం తన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్, సిటాడెల్: హనీ బన్నీ విడుదల కోసం సమంత వేచి చూస్తోంది. హనీ బన్నీ ప్రచారంలోను బిజీ. అలాగే సల్మాన్ ఖాన్ సరసన తదుపరి చిత్రంలో నటించే అవకాశం ఉందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. కానీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. తాప్సీ నిర్మాణ సంస్థలోను సమంత నటిస్తుందని కథనాలొస్తున్నాయి.