సామ్ మళ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటుందా? అందుకే ఆ మూవీ..

స్టార్ హీరోయిన్ సమంత.. ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే.

Update: 2024-06-11 09:45 GMT

స్టార్ హీరోయిన్ సమంత.. ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ కొన్ని నెలలకే పరస్పరం అంగీకారంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత సమంత.. మయోసైటిస్ బారిన పడి అనేక సమస్యలను ఎదుర్కొంది. కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండి చికిత్స తీసుకుంది.

యశోద మూవీ టైమ్ తో తాను మయోసైటిస్ బారిన పడ్డట్టు అనౌన్స్ చేసింది సమంత. ఆ మూవీ కంప్లీట్ చేసి తనకు వచ్చిన వ్యాధికి తగ్గట్టు చికిత్స తీసుకుంది. ఆ తర్వాత స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ఖుషీ మూవీ చేసింది. ప్రియాంక చోప్రా సిటాడెల్ సిరీస్ ఇండియన్ వెర్షన్ సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ సరసన యాక్ట్ చేసింది. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి మళ్లీ విదేశాలకు వెళ్లిపోయింది.

కొన్ని నెలల తర్వాత ఇండియాకు తిరిగొచ్చి.. మళ్లీ తాను సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది. సిటాడెల్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలిపింది. దీంతో సమంత హెల్త్ అంతా ఓకే అయ్యినట్లుందని సంతోషపడ్డారు. అదే సమయంలో తన పుట్టినరోజు స్పెషల్ గా 'మా ఇంటి బంగారం పేరు'తో సినిమా ప్రకటించింది సమంత.

తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఆ సినిమా రూపొందుతున్నట్లు తెలిపింది. పోస్టర్ లో చీరకట్టులో డబుల్ బ్యారెల్ గన్ పట్టుకొని సమంత కనిపించి మూవీపై బజ్ క్రియేట్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో సమంత.. మళ్లీ చికిత్స తీసుకోవడం ప్రారంభించిందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

సమంత ప్రస్తుతం స్కిన్ తో పాటు ఇమ్యూనిటీ పవర్ కు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. వాటికి చికిత్స పొందుతుందని టాక్ వస్తోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న రెడ్ బాత్, స్టీమ్ బాత్ వంటివి ట్రీట్మెంట్ లో భాగమని తెలుస్తోంది. అందుకే 'మా ఇంటి బంగారం' మూవీ షూటింగ్ జరగట్లేదని సమాచారం. మరి సామ్.. తన హెల్త్ పై ఏమైనా అప్డేట్ ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News