ఇలాంటి సర్ ప్రైజ్ ఊహకి కూడా రానిదే సామ్!
సమంత ఇన్ స్టాకి వచ్చిందంటే ఎన్నో విషయాలు పంచుకుంటుంది.
సమంత ఇన్ స్టాకి వచ్చిందంటే ఎన్నో విషయాలు పంచుకుంటుంది. కెరీర్ ఆరంభంలో వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచినప్పటికీ ఇప్పుడు వాటిని సైతం పబ్లిక్ గా చెప్పేస్తుంది. దాపరికం లేని జీవితమంటూ తన లైఫ్ లో జరిగిన ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంటుంది. తాజాగా ముంబై వేదికగా జరిగిన ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల కార్యక్రమంలో పాల్గోంది. ఈ వేడుకలో అమ్మడు నలుపు రంగు గౌను ధరించి హోయలొలికించింది. తాజాగా ఈ ఫోటోల్ని ఇన్ స్టాలోనూ షేర్ చేసింది.
నాకెంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించా. దీన్ని అందంగా డిజైన్ చేసిన క్రేశా బజాజ్ కి కృతజ్ఞతలు. నా అలవాట్లను మార్చుకోవడం.. జీవిన శైలిని మరింత స్థిరంగా చేసు కోవడం..పాత దుస్తుల్ని రీమోడలింగ్ చేయించడం ఒకటి. మీరు నాపై చూపిస్తోన్న అభిమానానికి ధన్యవాదాలు` అని అంది. అయితే ఈ నలుపు రంగు గౌను తొలుత ఓచీర. నాగచైతన్యతో పెళ్లి సందర్భంగా ధరించింది. హిందు సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి తంతులో రామానాయుడు సతీమణిచీరను సమంత రీమోడల్ చేయించి కట్టుకున్నారు.
ఇప్పుడదే చీరను ఇలా గౌనుగా మళ్లీ రీమోడల్ చేయించి ముంబై వేడుకలో ధరించింది. ఆచీరంటే తనకు ఎంతో ఇష్టమో ముందే చెప్పేసిన నేపథ్యంలో ! మరింత ఆసక్తికరంగా మారింది. చైతన్యతో విడిపోయినా ఆ జ్ఞాపకాలు కొన్నింటిని ఇంకా ఆమె పదిలంగానే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. వివాహమైన అనంతరం వేరు కాపురం నేపథ్యంలో ఓ ప్లాట్ లో ఉన్న సంగతి తెలిసిందే. అదే ప్లాట్ ని సమంత విడిపోయిన తర్వాత తన సొంతం చేసుకుంది. అప్పట్లో ఆ వార్త కూడా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా చీర గౌనుగా మారడం ఇంట్రెస్టింగ్.
`ఖుషీ` తర్వాత గ్యాప్ తీసుకున్న సమంత మళ్లీ బిజీ అయ్యే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టాలీవుడ్ కన్నా బాలీవుడ్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. మకాం హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే `సీటాడెల్` వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి చేసింది. కొన్ని సినిమాలకు సైన్ చేసింది. అవి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.