బ్రో : ఆ ఐడియా త్రివిక్రమ్‌ దే : సముద్రఖని

ఒక సినిమా విషయమై త్రివిక్రమ్‌ గారితో మాట్లాడుతున్న సమయంలో ఒక పెద్దాయన నాకు కాల్‌ చేసి చాలా సమయం మాట్లాడారు.

Update: 2023-07-20 10:37 GMT

పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందిన 'బ్రో' సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్‌... హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ.. చిత్ర దర్శకుడు సముద్ర ఖని పాల్గొన్న ఇంటర్వ్యూలను మీడియాకు విడుదల చేయడం జరిగింది.

బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ నటిస్తే బాగుంటుందనే ఆలోచన మొదట త్రివిక్రమ్‌ కి కలిగిందని దర్శకుడు సముద్ర ఖని పేర్కొన్నారు. దర్శకుడు సముద్ర ఖని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక సినిమా విషయమై త్రివిక్రమ్‌ గారితో మాట్లాడుతున్న సమయంలో ఒక పెద్దాయన నాకు కాల్‌ చేసి చాలా సమయం మాట్లాడారు.

ఆ పెద్దాయన నేను తమిళంలో చేసిన వినోదాయ సిథం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురి అయ్యాడు. ఆయన్ని ఓదార్చడానికి నాకు చాలా సమయం పట్టింది. దాంతో ఎవరు ఫోన్ అంటూ నా ముందు ఉన్న త్రివిక్రమ్‌ గారు అడిగారు. అప్పుడే నేను వినోదాయ సిథం సినిమాను గురించి ఆయనకు చెప్పాను.

వెంటనే స్టోరీ లైన్ ఏంటి అని అడిగారు. నేను కథ చెప్పిన వెంటనే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందో ఆయన చెప్పేశారు. అదే సమయంలో వెంటనే పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ లు ఈ సినిమా లో నటిస్తే బాగుంటుందని అన్నారు. అన్నట్లుగానే వారిద్దరితో త్రివిక్రమ్‌ మాట్లాడారు.

త్రివిక్రమ్‌ చెప్పడంతో పవన్‌ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్‌ తేజ్ మరో ఆలోచన లేకుండా 'బ్రో' సినిమా లో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా సముద్రఖని మాటల ద్వారా అర్థం అవుతుంది. అంతకు ముందు భీమ్లా నాయక్‌ సినిమా కూడా త్రివిక్రమ్‌ ఎంపిక చేయడం వల్లే పవన్‌ చేశాడు.

ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా వినోదాయ సిథం రీమేక్ కు పవన్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చి ఉంటాడు. ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూనే రచన వ్యవహారాలు.. స్క్రిప్ట్‌ విషయం చూసుకున్నారు. అయితే ప్రమోషన్ కార్యక్రమాలను మాత్రం త్రివిక్రమ్‌ చూసుకోవడం లేదనే టాక్‌ వినిపిస్తుంది.

Tags:    

Similar News