నల్లని చీరలో మెరుపులాంటి అందం

ప్రతి ఫోటోలో ఆమె చూపించే స్మైల్, నడవడికకు నెటిజన్లు ఫిదా అవుతారు. సాంప్రదాయమైన దుస్తుల్లో కూడా ఆమె స్టైలిష్ గా కనిపించడం విశేషం.

Update: 2024-12-01 14:17 GMT

సంయుక్త మీనన్ ఇటీవలి ఫోటోషూట్ లతో మరింత అందంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ కు తగ్గట్లే అమ్మడు ఫాలోవర్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక లేటెస్ట్ గా బ్లాక్ శారీలో ఆమె అందం మరింత మెరిసిపోయింది. నాజూకైన డిజైన్ ఉన్న శారీ, సింప్లిసిటీతో కూడిన మేకప్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చూపించిన భావాలు, చిరునవ్వు నెటిజన్లను విశేషంగా ఆకర్షించాయి. స్టైలిష్ జువెలరీతో ఆమె మరింత గ్రేస్ చూపించింది.

 

సంయుక్త మలయాళ చిత్రరంగంతో తన కెరీర్ ప్రారంభించింది. మొదట చిన్న సినిమాల ద్వారా క్రేజ్ అందుకుంది. ఇక టాలీవుడ్ లో భీమ్లా నాయక్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. విరూపాక్ష, బింబిసార చిత్రాలు ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాల్లో ఆమె టాలెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

 

సోషల్ మీడియాలో సంయుక్త చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. సాధారణ అవుట్ ఫిట్స్ లోనూ ఆమె నాజూకైన అందం స్పష్టంగా హైలెట్ అవుతోంది. ప్రతి ఫోటోలో ఆమె చూపించే స్మైల్, నడవడికకు నెటిజన్లు ఫిదా అవుతారు. సాంప్రదాయమైన దుస్తుల్లో కూడా ఆమె స్టైలిష్ గా కనిపించడం విశేషం.

 

ఇక అమ్మడి చేతిలో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు, శర్వానంద్ తో లవ్ స్టోరీలో నటిస్తోంది. పవర్‌ఫుల్ లైనప్‌తో ముందుకు వెళ్తూ బాలీవుడ్, మలయాళ చిత్రాలలోనూ అవకాశాలను అందుకుంటోంది. టాలీవుడ్ లో ఆమెకు మంచి బ్రేక్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. సంయుక్త తన టాలెంట్ తో మరిన్ని విజయాలను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News