కుందనపు బొమ్మలా కనువిందు చేస్తోన్న సంయుక్త
చక్కగా చీరకట్టుకొని, నిండుగా ఆభరణాలు వేసుకొని కనిపిస్తే ఆ అందం ఎలాంటి వారినైనా ఇట్టే ఆకర్షిస్తుంది.
హీరోయిన్స్ ఎంత మోడ్రన్ గా కనిపించినా కూడా ఆ అందానికి మెరుగులు అద్దేది మాత్రం భారతీయ సంప్రదాయ వస్త్రధారణ అని ఓ వర్గం ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. చక్కగా చీరకట్టుకొని, నిండుగా ఆభరణాలు వేసుకొని కనిపిస్తే ఆ అందం ఎలాంటి వారినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక కొంతమంది నటీమణులు చీరకట్టులో చాలా అందంగా కనిపిస్తారు.
సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్ సంయుక్త మీనన్ ని అలా చీరలో చూస్తుంటే మాత్రం ఆమెలో ఒక క్వీన్ లా కనిపిస్తూ ఉంటుంది. ఆమె చేసే క్యారెక్టర్స్, వేసే కాస్ట్యూమ్స్ కారణంగా సంయుక్త మీనన్ పైన అందరికి ఒక రకమైన క్రేజ్ పెరిగింది. అందంగా కనిపించడానికి హాట్ హాట్ కాస్ట్యూమ్స్ వేయాల్సిన పని లేదు. నిండైన వస్త్రధారణలో కూడా గ్లామర్ గా కనిపించొచ్చు అని సంయుక్త మీనన్ ప్రూవ్ చేస్తూ ఉంటుంది.
ఇండియన్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లతోనే ఆమె ఎక్కువగా ఫోటోషూట్ లలో సందడి చేస్తూ ఉంటుంది. తన అందంతో అందరిని ఎట్రాక్ట్ చేస్తూనే కనికట్టు చేసే రూపంతో సంయుక్త మనసు దోచేస్తుంది. అందుకే సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ TBZ లో ఒక జ్యూయిలరీ షాప్ లాంచింగ్ లో సంయుక్త చీఫ్ గెస్ట్ గా పాల్గొంది. ఇందులో చక్కనైన ట్రెడిషనల్ చీరకట్టులో జ్యూయిలరీ అలంకరించుకొని పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటోలకి ఫోజులిచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
స్కై బ్లూ కలర్ శారీ కట్టుకొని దానిపై అదిరిపోయే జ్యూయిలరీ కలెక్షన్స్ ని వేసుకొని కనిపిస్తూ ఉండే కుందనపు బొమ్మలా ఉందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో నిఖిల్ కి జోడీగా స్వయంభు సినిమాలో చేస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ రామ్ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే మహారాగ్ని సినిమాతో సంయుక్త బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.