108 రోజులుగా అదే సన్నజాజి నడుము
వరుస విజయాలతో దూకుడు మీదున్న సంయుక్త నిరంతర ఫోటోషూట్లు స్పెషల్ ట్రీట్ గా మారాయి.
ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సరసన `స్వయంభు`లో నటిస్తోంది సంయుక్త మీనన్. ప్రతిభతో మెరిసిపోయే ఈ బ్యూటీ సౌత్‌లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. జాతీయ అవార్డ్ గ్రహీత ధనుష్ తో కలిసి సర్ (వాతి) లో.. కళ్యాణ్ రామ్ తో బింబిసార .. సాయిధరమ్ తేజ్ తో విరూపాక్ష లో నటించింది. ఇవన్నీ విజయాలు సాధించడమే గాక నటిగా తనకు మంచి పేరు తెచ్చాయి. వరుస విజయాలతో దూకుడు మీదున్న సంయుక్త నిరంతర ఫోటోషూట్లు స్పెషల్ ట్రీట్ గా మారాయి.
సంయుక్త తాజాగా తన ఫిట్ అండ్ ఫ్యాబ్ లుక్ కి సంబంధించిన ఫోటోని షేర్ చేయగా అది అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. ఈ బ్యూటీ జిమ్ లో ప్రత్యేకించి తన నడుము సైజ్ ఏ మేరకు తగ్గిందో పరిశీలిస్తోంది. 108 రోజులుగా ఆ సన్నజాజి నడుము కించిత్ కూడా పెరగకుండా మెయింటెయిన్ చేయగలిగానని సంయుక్త వ్యాఖ్యను జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఆ నడుములోనే ఏదో రహస్యం దాగి ఉంది..! అంటూ అభిమానులు కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. జిమ్ లో సంయుక్త కమిట్ మెంట్ డెడికేషన్ ని ప్రశంసించాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక సంయుక్త ఫిట్ నెస్ వెనక సుప్రియ అయ్యర్ అనే ప్రతిభావని ఉన్నారు. కోచ్ శిక్షణలో సంయుక్త తన నడుము కొలతను తగ్గించుకోగలిగింది. టాలీవుడ్ లో వేగంగా స్టార్ డమ్ అందుకుంటున్న కథానాయికల్లో సంయుక్త పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తోంది. తదుపరి స్వయంభు విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
బాలీవుడ్ లో మహారాగ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే చిత్రంలో సంయుక్త నటిస్తోంది. అలాగే మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న రామ్ అనే మలయాళ చిత్రంలోను సంయుక్త నటిస్తోంది.