దేవర సీక్రెట్స్ రాబట్టాలని యానిమల్ మేకర్ ప్లాన్స్..!

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుంది.

Update: 2024-09-14 09:56 GMT

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఈసారి ముంబై నుంచి మొదలు పెట్టాడు చిత్ర యూనిట్. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేశారు. ఇక రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా యానిమల్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.

కొరటల శివ, ఎన్టీఆర్, జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దేవర సినిమాపై సందీప్ మార్క్ ప్రశ్నలతో ఆ టీం తో ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ జరిగింది. ఇందులో దేవర లెంగ్త్ ఇంకా సినిమా హైలెట్స్ గురించి ప్రస్తావించారు. దేవర సినిమా హ్యూజ్ హిట్ అవుతుందని జాన్వి కపూర్ అనగా.. సినిమా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఎన్ టీ ఆర్ అన్నారు. అంతేకాదు షార్క్ ఫైట్, బోట్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడారు.

ఇంటర్వ్యూ ప్రోమో సందీప్ వంగ ఆ మూన్ సీన్ గురించి అడిగాడు. ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ గా దేవర టీం సందీప్ వంగ ఇంటర్వ్యూ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతుంది. ప్రస్తుతానికి ప్రోమో మాత్రం అదిరిపోయింది. తప్పకుండా ఈ ఇంటర్వ్యూతో బాలీవుడ్ లో దేవర గురించి స్పెషల్ డిస్కషన్ మొదలు పెడతారని చెప్పొచ్చు. దేవర సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

కొరటాల శివ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి జనతా గ్యారేజ్ సినిమా చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఐతే ఆచార్య ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ తో దేవర చేసి మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు కొరటాల శివ. దేవర బాక్సాఫీస్ విధ్వంసం కోసం ఫ్యాన్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సినిమాను సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తూ సినిమాపై తమకున్న అంచనాలను తెలియచేస్తున్నారు ఫ్యాన్స్.

Tags:    

Similar News