కొడుక్కి ఆ సూపర్ సినిమా పేరు పెట్టాడు.. ఈయన అంతే అదోటైపు..!
ప్రతి ఫ్రేమ్ దేనికదే ప్రత్యేకంగా సినిమాను టెక్నికల్ వాల్యూస్ తో తీసేలా ఉండేది.
సినిమా ఫార్మాట్ ని మార్చే దర్శకులు ఎప్పుడు వస్తూనే ఉంటారు. అప్పట్లో ఒక రెగ్యులర్ సినిమా ఫార్మెట్ నడుస్తున్న టైం లో రాం గోపాల్ వర్మ అనే అతను వచ్చి శివ సినిమా తీసి అదరగొట్టేశాడు. శివ సినిమా ఎన్నో సినిమాలకు ఒక లెర్నింగ్ లెసన్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ అప్పట్లో ఆర్జీవి ఎలాంటి సినిమా తీసినా అందులో 24 క్రాఫ్ట్స్ వర్క్ బాగా ఎక్స్ పోజ్ అయ్యేవి. ప్రతి ఫ్రేమ్ దేనికదే ప్రత్యేకంగా సినిమాను టెక్నికల్ వాల్యూస్ తో తీసేలా ఉండేది. ఐతే ఇప్పుడు ఆ ఆర్జీవి కనిపించడం మానేశాడు.
ఐతే ఆర్జీవి అంత కాకపోయినా తన సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ తో హిట్లు సూపర్ హిట్లు కొడుతున్నాడు డైరెక్టర్ సందీప్ వంగ. అర్జున్ రెడ్డితో ఆయన చేసిన ఫస్ట్ అటెంప్ట్ సూపర్ హిట్ అవ్వడం అదే సినిమా హిందీలో రీమేక్ చేసి అక్కడ హిట్టు కొట్టడం సందీప్ డైరెక్షన్ టాలెంట్ ఏంటో దేశం మొత్తం తెలిసేలా చేసింది. ఇక రణ్ బీర్ కపూర్ తో చేసిన యానిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యి మరోసారి సందీప్ వంగ పేరు మారుమోగేలా చేసింది.
హీరో క్యారెక్టరైజేషన్ తో సందీప్ చేస్తున్న మ్యాజిక్ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు మెంటల్ మాస్ అనిపిస్తుంది. యానిమల్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమా ప్లానింగ్ లో ఉన్న సందీప్ వంగ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆయన ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. సందీప్ వంగ ఒక డాక్టర్ ఐతే సినిమాల మీద ఆసక్తితో ఆయన డైరెక్టర్ గా టర్న్ అయ్యారు. అర్జున్ రెడ్డి సినిమా కథ విజయ్ కన్నా ముందు ఇద్దరు ముగ్గురు హీరోలకు చెప్పాడు సందీప్.
అర్జున్ రెడ్డి సినిమా టైం లోనే కొడుకు పుట్టడంతో అతని పేరు కూడా అర్జున్ రెడ్డి అనే పెట్టాడట సందీప్ వంగ. అర్జున్ అనే పేరులో ఒక షార్ప్ నెస్ ఉంటుందని ఆమధ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సందీప్ వంగ. సో అలా తన మొదటి సినిమా హిట్ టైటిల్ నే కొడుకు పేరుగా పెట్టేశాడు. ప్రభాస్ స్పిరిట్ తర్వాత యానిమల్ సీక్వెల్ గా యానిమల్ పార్క్ కూడా తీయాలనే ఆలోచనలో ఉన్నాడు సందీప్ వంగ. ఇతని హీరోల లిస్ట్ లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడని తెలిసిందే.