సందీప్ వంగా మళ్లీ రికార్డ్ బ్రేకింగ్
అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. షాహిద్ కపూర్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని ఇచ్చాడు
అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. షాహిద్ కపూర్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కి కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు అదే దర్శకుడు పని చేస్తున్నాడు. 'యానిమల్' చిత్రంతో రణబీర్ కి పాన్ ఇండియా మార్కెట్ ని అప్పగిస్తున్నాడని నమ్మకంగా చెబుతున్నారు. ప్రభాస్ సలార్ టీజర్ కి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో యానిమల్ టీజర్ కి అంతటి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు రణబీర్ కి తెలుగు దర్శకుడు సందీప్ వంగా ది బెస్ట్ ఇస్తున్నాడని భావిస్తున్నారు.
యానిమల్ రణబీర్ కెరీర్ బెస్ట్ సినిమాగా రికార్డులకెక్కనుందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహకాల్లో ఉంది. తాజా సమాచారం మేరకు యానిమల్ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్లు కొట్టిన జవాన్ - బ్రహ్మాస్త్రా చిత్రాలను మించి USAలో విడుదల కానుంది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుందని ఇప్పటికే చిత్రబృందం ఖరారు చేసింది. తెలుగు కుర్రాడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ 2023లో అతిపెద్ద చిత్రం. తాజా పరిణామాల ప్రకారం, హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ యానిమల్ వరల్డ్ వైడ్ రిలీజ్ రికార్డ్ లను కొట్టేస్తుందని అంచనా వేస్తున్నారు. యానిమల్ అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా USAలో రణబీర్ కపూర్ కి అతిపెద్ద విడుదల కానుంది.
ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 888 కంటే ఎక్కువ స్క్రీన్‌లను పొందిందని తెలిసింది. ఈ సంఖ్య జవాన్ -బ్రహ్మాస్త్ర వంటి ఇతర బాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ల కంటే పెద్దది. జవాన్ USAలో 850 స్క్రీన్లలో విడుదలైంది. అయితే బ్రహ్మాస్త్ర కేవలం 810 స్క్రీన్లలో మాత్రమే విడుదలైంది. USAలో 'యానిమల్' ఇంత భారీ స్థాయిలో విడుదలైన తొలి హిందీ చిత్రంగా కూడా నిలిచింది. ప్రీ-టీజర్ - టీజర్‌తో ఈ చిత్రం గొప్ప బజ్ క్రియేట్ చేసింది. పాటలు అభిమానుల్లో హత్తుకుపోయాయి. ఇప్పుడు ట్రైలర్ కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతకు మించి అనిల్ కపూర్ పాత్ర క్యూరియాసిటీని సృష్టించింది. బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది.
భూషణ్ కుమార్ -క్రిషన్ కుమార్ లతో కలిసి సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్ - ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ యానిమల్‌కు మద్దతు ఇచ్చాయి. ఈ చిత్రం క్రైమ్ డ్రామా జానర్‌లో తెరకెక్కింది. 1 డిసెంబర్ 2023న వీక్షకులను థ్రిల్‌ని ఇచ్చేందుకు థియేటర్లలోకి వస్తోంది.