'సంక్రాంతికి వస్తున్నాం' - బజ్ గట్టిగానే ఉందిగా..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి మరోసారి సిద్ధమయ్యారు.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి మరోసారి సిద్ధమయ్యారు. అనిల్ రవిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారి కొత్త చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రమోషన్ తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవల విడుదలైన పోస్టర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేసింది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ చిత్రంగా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో వెంకటేష్ పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపిస్తున్నారు. చేతిలో పెద్ద తుపాకి పట్టుకుని ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. అలాగే సినిమాపై ఉన్న బజ్ కూడా ఏ రేంజ్ లో ఉందొ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా 50,000కిపైగా బుక్ మై షో ఇంట్రెస్ట్ పొందినట్లు తెలుస్తోంది. సంక్రాంతి హంగామాలో సినిమా మీద భారీ హైప్‌ను సూచిస్తోందని మరోసారి అర్ధమవుతుంది.
అనిల్ రవిపూడి చెప్పిన కథ గురించి ఇప్పటికే ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. కుటుంబ సంబంధాల నేపథ్యంలో కామెడీ, ఎమోషన్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. వెంకటేష్ గతంలో అనిల్ రవిపూడితో ఎఫ్ 2 చిత్రంలో సాలీడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ప్రేక్షకులకు పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా కామెంట్స్ వస్తున్నాయి.
ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర నెవ్వర్ బిఫోర్ అనేలా డిఫరెంట్ గా ఉండనుందని మేకర్స్ వెల్లడించారు. వెంకటేష్ ఇప్పటికే అభిమానులను తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, ఈసారి కూడా కామెడీ, యాక్షన్ కలగలిపిన పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ప్రత్యేకంగా సినిమాకు సంబంధించిన మరో స్పెషల్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుంది.
భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం వెంకటేష్ అభిమానులకు పండుగ కానుకగా రాబోతుంది. ఇటీవలే మొదలైన పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. సంక్రాంతి బరిలో నిలిచే ప్రధాన చిత్రాలలో సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ ఫ్యామిలీ మూవీగా నికిచే అవకాశం ఉంది. ప్రత్యేకంగా వెంకటేష్ లుక్, ఐశ్వర్య రాజేష్ వైఫ్ రోల్, మీనాక్షి పోలీస్ రోల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.