సంక్రాంతిలో ఓ సెంటిమెంట్ పోటీ

అలాగే దిల్ రాజుకి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువగానే ఉంది. గత కొన్నేళ్ళుగా సంక్రాంతికి వచ్చిన సినిమాలతో దిల్ రాజు సూపర్ హిట్స్ కొట్టాడు

Update: 2023-10-14 04:23 GMT

వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ పై చాలా మంది ఇప్పటి నుంచే దృష్టి పెట్టి ఉన్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, ప్రశాంత్ వర్మ హనుమాన్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అయితే పక్కాగా రేసులో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలు అన్ని దేనికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. అయితే ఈ సినిమాలలో కొన్ని వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఈగల్ మూవీ ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో కచ్చితంగా పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా టైం తీసుకొనే ఛాన్స్ ఉంది. అందుకే సంక్రాంతి రేసులో ఈ చిత్రం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. హనుమాన్ సినిమా రిలీజ్ విషయంలో కూడా పూర్తిగా క్లారిటీ లేదు.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంక్రాంతితో మంచి సెంటిమెంట్ ఉంది. అతని హిట్ సినిమాలు చాలా వరకు సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయినవే కావడం విశేషం. ఈ కారణంగా గుంటూరు కారం సినిమాని కూడా సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

అలాగే దిల్ రాజుకి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువగానే ఉంది. గత కొన్నేళ్ళుగా సంక్రాంతికి వచ్చిన సినిమాలతో దిల్ రాజు సూపర్ హిట్స్ కొట్టాడు. అందులో ఎఫ్2 లాంటి మూవీస్ ఉండటం విశేషం. అలాగే త్రివిక్రమ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురంలో మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది.

ఇలా ముగ్గురికి సంక్రాంతి సీజన్ సెంటిమెంట్ భాగా ఉండటంతో గుంటూరుకారం మూవీతో పాటుగా దిల్ రాజు నిర్మిస్తోన్న ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా అదే టైంలో రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన సినిమాలు రేసులో ఉంటాయా లేదా అనేది జనవరి నెల వచ్చేసరికి క్లారిటీ రావొచ్చు.

Tags:    

Similar News