సంక్రాంతి సినిమాలు.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం డివైడ్ టాక్ నుంచి మొదలైన బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న మూవీ హనుమాన్. రెండో స్థానంలో కింగ్ నాగార్జున నా సామి రంగా ఉంది. తెలుగు, తమిళ్ భాషలలో కలిపి మొత్తం సంక్రాంతికి ఆరు సినిమాలు రిలీజ్ కాగా అందులో నాలుగు మూవీస్ టాలీవుడ్ నుంచి వచ్చినవి కావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం డివైడ్ టాక్ నుంచి మొదలైన బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది.
తమిళంలో అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో శివ కార్తికేయన్ అయలాన్ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఆరింటిలో రెండు చిత్రాలు మాత్రమే సాలిడ్ లాభాలని నిర్మాతకి తీసుకొచ్చాయని చెప్పాలి.
ఇక ఈ సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని మూవీస్ కి సంబందించిన ఓటీటీ డీల్స్ క్లోజ్ అయ్యాయి. ఫ్యాన్సీ ధరకి రిలీజ్ కి ముందే ఆయా సినిమాల ఓటీటీ హక్కులని డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కొనుగోలు చేశాయి. వీటన్నింటిలో ముందుగా ఓటీటీలోకి వస్తోన్న సినిమా విక్టరీ వెంకటేష్ సైంధవ్. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ ఫిబ్రవరి ౩న రిలీజ్ అవుతోంది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ని ఎంత వరకు ఎంటర్టైన్ చేయగలదో చూడాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9 లేదంటే 16న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అఫీషియల్ రిలీజ్ డేట్ ని నెట్ ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేయలేదు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఫిబ్రవరి 15న కింగ్ నాగార్జున నా సామి రంగ మూవీ హాట్ స్టార్, హులు ఛానల్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ రెండు యాప్స్ కూడా డిస్నీ వారివే కావడం విశేషం.
శివ కార్తికేయన్ అయలాన్ మూవీ సన్ నెక్స్ట్ లో ఫిబ్రవరి 15న స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయకుండానే డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ ఎనౌన్స్ చేయడం విశేషం. తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ మూవీ మార్చి 22న జీ5 లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ఇంకా థియేటర్స్ లో కొనసాగుతుండటంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతోంది.