టాలీవుడ్ బాక్సాఫీస్.. కన్నడ సినిమాకు బెస్ట్ ఛాన్స్

రక్షిత్ శెట్టి రుక్మిణి వసంత జంటగా నటించిన ఈ సినిమా కన్నడలో సెప్టెంబర్ 1వ తేదీన విడుదల అయింది. చిన్న లిమిటెడ్ బడ్జెట్ లోనే నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్స్ అందించింది.

Update: 2023-09-22 02:30 GMT

సెప్టెంబర్ మొదటి వారంలో రావలసిన కొన్ని ఆసక్తికరమైన సినిమాలు అన్నీ కూడా సలార్ వాయిదా పడడంతో నెల చివరకు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే గత వారం మార్క్ ఆంటోనీ తప్పితే పెద్దగా బజ్ ఉన్న సినిమాలు అయితే రాలేదు. ఆ సినిమా కూడా తెలుగులో అంతగా ఆకట్టుకోవడం లేదు. ఇక అంతకు ముందు వచ్చిన జవాన్ సినిమాతో పాటు శెట్టి మిస్టర్ పోలిశెట్టి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకున్నాయి.

ఈ వారం కూడా ఆ సినిమాలకు డీసెంట్ కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మరొక వారం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా హడావిడి కనిపించే అవకాశం అయితే లేదు. ఈ శుక్రవారం కేవలం ఒకే ఒక్క బజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అది కూడా కన్నడ డబ్బింగ్ సినిమా కావడం విశేషం.

కన్నడలో మంచి సక్సెస్ అందుకున్న 'సప్త సాగరాలు దాటి..' సినిమాను తెలుగులో డబ్ చేసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ తో కూడా కాస్త హడావిడి చేసి తప్పకుండా సినిమా తెలుగు వారికి కనెక్ట్ అవుతుంది అని నమ్మకంగా కనిపించారు.

రక్షిత్ శెట్టి రుక్మిణి వసంత జంటగా నటించిన ఈ సినిమా కన్నడలో సెప్టెంబర్ 1వ తేదీన విడుదల అయింది. చిన్న లిమిటెడ్ బడ్జెట్ లోనే నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్స్ అందించింది. అయితే ఇప్పుడు ఆ కంటెంట్ తెలుగు ఆడియోన్స్ కు కూడా కనెక్ట్ అవుతుంది అని కొన్ని లిమిటెడ్ థియేటర్స్ లో మొదటి విడుదల చేయబోతున్నారు.

అయితే పోటీగా మాత్రం ఈ సినిమాకు తెలుగులో అయితే ఎలాంటి సినిమాలు విడుదల కావడం లేదు. కాబట్టి ఈ వారం సినిమా మంచి టాక్ అందుకుని ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి కన్నడ ప్రేక్షకులకు కనెక్ట్ అయిన ఈ లవ్ స్టోరీ సినిమా తెలుగువారిని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News