డబుల్ ఇస్మార్ట్ లో సారా అలీఖాన్!
డ్యాషింగ్ డైరెక్టర్ ఏకంగా సైఫ్ అలీఖాన్ కుమార్తె సారీ అలీఖాన్ ని దించుతున్నట్లు పూరి కాంపౌండ్ వర్గాల నుంచి తెలిసింది.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమా పట్టాలెక్కకు ముందే హీరోయిన్ ఎవరు? అన్నది తెలిసిపోతుంది. లాంచింగ్ డే రోజునే హీరోయిన్ ని పరిచయం చేస్తుంటారు. ఆయన ఎంత పెద్ద స్టార్ తో సినిమా తీసినా హీరోయిన్ విషయం మాత్రం దాచి పెట్టరు. ఆయన హీరోయిన్లు కూడా ఎలాగూ ముంబై నుంచో..ఢిల్లి నుంచి దిగుమతి అయినా మెడల్సే ఎక్కువగా ఉంటారు. అందులోనూ వాళ్ల వయసు 20 నుంచి 27 ఏళ్ల మధ్యలోనే ఉంటుంది.
ఆ వయసున్న భామల్నే పూరి తన సినిమాల్లో హీరోయిన్ గా తీసుకుంటాడు. ఈ విషయంలో పూరి టేస్ట్ చాలా ప్రత్యేకమైనది. ఇండస్ట్రీకి ...సినిమాకి ప్రెష్ ఫీల్ ని ఆ రకంగా తీసుకురాగల దర్శకుడాయన. మరి డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్ ఎవరు? ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో రొమాన్స్ చేస్తుంది ఎవరు? అంటే ఇంత వరకూ క్లారిటీ లేదు. ఇప్పటికే షూటింగ్ కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది.
మరో నెల రెండు నెలల్లో షూట్ కూడా పూర్తి చేసేస్తారు. పూరి ఫాస్ట్ మేకింగ్ గురించి తెలిసిందే. ఎంత స్పాన్ ఉన్న కథైనా మూడు నెలల సమయం అంటేనే ఎక్కువ. కాకపోతే వరుస వైఫల్యాల నేపథ్యంలో ఇప్పుడా వేగం తగ్గించారును అనుకోండి. మరి ఇంతకీ డబుల్ ఇస్మార్ట్ కోసం ఏ భామని దించుతున్నారా? తెలుసా? అంటే డ్యాషింగ్ డైరెక్టర్ ఏకంగా సైఫ్ అలీఖాన్ కుమార్తె సారీ అలీఖాన్ ని దించుతున్నట్లు పూరి కాంపౌండ్ వర్గాల నుంచి తెలిసింది.
పూరి రాసిన పాత్రకి సారా అయితే బాగుంటుందని ఆమెని ఒప్పించినట్లు వినిపిస్తుంది. ఇందులో హీరోయిన్ రోల్ ఇన్నోసెన్స్ గా ఉంటుందిట. ఆ పాత్రకి కొత్త వాళ్లైతే బాగోదని పేరున్న యువ నాయికగా సెట్ అవుతుందని భావించి ఆమెని లాక్ చేసినట్లు వినిపిస్తుంది.
మరి ఇందులో నిజమెంత? అన్నది అధికారికంగా రివీల్ చేసే వరకూ క్లారిటీ రాదు. ఇప్పటికే సారా స్నేహితురాలు జాన్వీ కపూర్ 'దేవర' సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అవుతోంది. సారా ఎంట్రీ కూడా ఖరారైతే! స్నేహితురాళ్లు ఇద్దరు ఇండస్ట్రీని దున్నేస్తారు.