సారా టెండూల్కర్ స్టన్నింగ్ లుక్
సారా టెండూల్కర్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తప్పును అర్థం చేసుకున్నానని అన్నారు.
నేడు స్టార్ లు అంటే కేవలం నటీనటులే కాదు. ఒక స్టార్ అంటే ప్రభావవంతమైన వ్యక్తి.. సోషల్ మీడియాలో గణనీయమైన ఫాలోయింగ్ ఉన్నవారు.. సమాజంలో గొప్ప గౌరవం అందుకునేవారు.. వారి స్థానాన్ని నిలబెట్టుకుంటూ వైవిధ్యం చూపగల సామర్థ్యం కలిగి ఉన్నవారు.. అలాంటి ఒక వ్యక్తి సారా టెండూల్కర్. సారా టెండూల్కర్ ఎప్పుడూ ఆనందంగా దాంతో పాటు వచ్చే అందంతో ఉంది. ఆమె ఉనికి తన చుట్టూ ఉన్న ఎవరికైనా చిరునవ్వును తెస్తుంది... ప్రఖ్యాత మ్యానిఫెస్ట్ కవర్ స్టోరిలో సారా టెండూల్కర్ గురించి రాసిన కోట్ ఇది. ఇంతకంటే ఏం కావాలి? సారా ఇప్పటికే గొప్ప సెలబ్రిటీ అని చెప్పేందుకు. అందంలో ప్రతిభలో ఫిలింస్టార్లకు ఏమాత్రం తక్కువ కాదు. స్టాటస్ లో అంతకుమించి. సంఘంపై గొప్ప ప్రభావం చూపగల నేర్పరి. అందుకే మ్యానిఫెస్ట్ మ్యాగజైన్ ఇంతగా పొగిడేసింది.
సారా టెండూల్కర్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తప్పును అర్థం చేసుకున్నానని అన్నారు. నేను రిజర్వ్‌డ్‌గా ఉన్నాను... ప్రజల ముందు ఓపెన్ అవ్వడానికి నా సమయాన్ని వెచ్చించాను.. అని తెలిపారు. చిన్న వయస్సులోనే పవర్‌హౌస్‌గా ఉన్న సారా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలని ఆకాంక్షించారు. 2019లో ప్రారంభించబడిన సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ అనే లాభాపేక్షలేని సంస్థను సారా రన్ చేస్తున్నారు. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్న అమ్మాయి.
తాజా ఇంటర్వ్యూలో సారా మాట్లాడుతూ-``సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ వెనుకబడిన పిల్లలకు సహాయంలో భాగంగా వారి క్రీడలు, ఆరోగ్యం, విద్యపై దృష్టి పెడుతుంది. ఈ తరహా సేవలు నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి. ఫౌండేషన్ కి నా సామర్థ్యాల మేరకు మద్దతునివ్వడాన్ని ఒక ప్రత్యేకతగా భావిస్తాను`` అని తెలిపారు.
మ్యానిఫెస్ట్ ఇంటర్వ్యూ లో సారా తన ఆహార ప్రియత్వం గురించి ఓపెనైంది. ``నా ప్లేట్‌లో జపనీస్ వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. నేను ప్రతిరోజూ తినగలను! కానీ నేను అన్ని వంటకాలను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు, సరైన పోషకాహారంపై దృష్టి సారించే ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం నాకు చాలా ఇష్టం. నేను కూడా అప్పుడప్పుడు టెంప్టేషన్‌కి లొంగిపోతాను. కానీ అప్పుడు ఎవరేం చేయరు?`` అని అంది. ప్రతి రాత్రి తాను ఇమ్లీ (చింతపండు) తినడం ఆనందిస్తున్నట్లు సారా వెల్లడించింది!