టెండూల్కర్ వారసురాలు దేవతాసుందరి రూపం!
మరోవైపు టీమిండియా యువక్రికెటర్ శుభ్ మాన్ గిల్ పై సారా టెండూల్కర్ అభిమానం, స్నేహం గురించి తెలిసిన అభిమానులు ఆ ఇద్దరినీ లవర్స్ అంటూ ఆటపట్టిస్తుంటారు.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వారసురాలు సారా టెండూల్కర్ పరిచయం అవసరం లేదు. తనదైన అందం, వైబ్స్ తో నిరంతరం కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతున్న సారా టెండూల్కర్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాల్లో సారాను అనుసరించేవారి సంఖ్య లక్షల్లో ఉంది. మరోవైపు టీమిండియా యువక్రికెటర్ శుభ్ మాన్ గిల్ పై సారా టెండూల్కర్ అభిమానం, స్నేహం గురించి తెలిసిన అభిమానులు ఆ ఇద్దరినీ లవర్స్ అంటూ ఆటపట్టిస్తుంటారు.
ఇక సారా టెండూల్కర్ ఇప్పటికే పలువురు బాలీవుడ్ కథానాయికలతో కలిసి కమర్షియల్ ప్రకటనల్లో నటించడం వాటిలో తన అందంతో కట్టి పడేయడంతో సారా కూడా త్వరలోనే బాలీవుడ్ లో కథానాయికగా అడుగులు వేయడం ఖాయమని ఊహించారు. కానీ ఇప్పటివరకూ సారా నటరంగ ప్రవేశం గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ అన్నిచోట్లా సారా వైబ్స్ విస్తరిస్తూనే ఉన్నాయి. సారా ఏం చేసినా తన గురించి ఆరాలు తీసేవారున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో సారాను ఫాలో చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
తాజాగా సారా టెండూల్కర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానంతర వేడుకల్లో అద్భుతమైన గులాబీ రంగు లెహంగాలో ప్రత్యక్షమైంది. ఈవెంట్ లో హెడ్ టర్నర్ గా మారింది.
పెళ్లిలో సారా ఉనికిని అంతగా గుర్తించకపోయినా కానీ.. సొగసైన పింక్ లెహంగా ప్రకాశవంతమైన లుక్ సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చనీయాంశం అయింది. సారా తన అద్భుతమైన రూపానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా..అభిమానుల నుండి ప్రశంసలు కురిసాయి. ఇన్ స్టాలో చాలా మంది ఆమె పేరును యువ క్రికెట్ స్టార్ శుభ్‌మాన్ గిల్‌తో లింకప్ చేశారు. సారా- గిల్ సంబంధం గురించి ఊహాగానాలను మరింతగా పెద్ద స్థాయికి తీసుకెళుతున్నారు. ఒక అభిమాని హాస్యభరితంగా ``గిల్ భాయ్, సిరీస్ జీత్ కే ఆనా`` అని వ్యాఖ్యానించగా, మరొకరు ``శుబ్మాన్ గిల్ రెస్పెక్ట్ బటన్`` అని రాశారు. దీంతో గిల్ తో సారా బాండింగ్ పై వారు ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతోంది.
సారా టెండూల్కర్ తన కుటుంబంతో, ముఖ్యంగా తన సోదరుడు అర్జున్ టెండూల్కర్‌తో గొప్ప అనుబంధం కలిగి ఉంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం హృదయాలను టచ్ చేస్తుంది. సారా తరచుగా తన సోదరుడితో ఫోటోలను షేర్ చేస్తుంది. అతడిని తనకు ఇష్టమైన వ్యక్తిగా పేర్కొంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సారా సుమారు 68లక్షల మంది (6.8 మిలియన్ల మంది) ఫాలోవర్లను కలిగి ఉంది. ఈ వేదికపై తన అభిమానులతో సన్నిహితంగా ఉండటం.. తన ఆకర్షణీయమైన.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షేర్ చేయడంతో గొప్ప అభిమానం సంపాదించుకుంటోంది.