సరిపోదా శనివారం బిగ్ ఈవెంట్.. ఎప్పుడంటే..

ఇందులో యాక్షన్ సన్నివేశాలే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని టాక్.

Update: 2024-08-21 10:04 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన “సరిపోదా శనివారం” సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా కథ క్యారెక్టర్స్ పరంగా కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో నాని పాత్ర పూర్తి స్థాయి మాస్ అవతారంలో ఉంటుందని తెలుస్తోంది.

ఇందులో యాక్షన్ సన్నివేశాలే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని టాక్. సరిపోదా శనివారం నాని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘దసరా,’ ‘హాయ్ నాన్న’ లాంటి భారీ విజయాల తర్వాత నాని ఈ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈసారి నాని మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అలాగే దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి యాక్షన్ డ్రామా జానర్ లో ఈ సినిమా తీశాడట.

ఇక సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ ప్రమోషన్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆగస్ట్ 24న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. నాని అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.

ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సినిమా నిడివి 174 నిమిషాల 50 సెకండ్లు ఉన్నట్లు సమాచారం. అంటే ఇది సుమారు మూడు గంటలకు దగ్గరలో ఉండటంతో సినిమా కథనంపై ప్రేక్షకుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ సుదీర్ఘ నిడివి ప్రేక్షకులకు యాక్షన్ ఎలిమెంట్స్ తో ఎంగేజ్ చేస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. నాని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ పై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి, ఈ కార్యక్రమంలో ఏమేం విశేషాలు బయటకు వస్తాయో చూడాలి. అలాగే తమిళంలో కూడా నాని స్పెషల్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News