కట్టప్ప కూతురును మీరు ఎప్పుడైనా చూశారా..!

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు సత్యరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

Update: 2024-10-25 20:30 GMT

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు సత్యరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ సత్య రాజ్ గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగు ఇతర భాషల్లోనూ క్రమం తప్పకుండా కనిపిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ లో ఎక్కువ సినిమాలు చేశారు. మిర్చి సినిమాలో ప్రభాస్ కి తండ్రి పాత్రలో కనిపించి మంచి మార్కులు సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌ లో ఆయన కట్టప్ప పాత్రతో ఒక్కసారిగా స్టార్‌ డమ్ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసిన విషయం తెల్సిందే.

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర పోషించడం ఆయన కెరీర్‌ లో అత్యంత కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న సత్యరాజ్‌ అన్ని భాషల్లోనే స్టార్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, ఆయన పాత్రలకు మంచి మార్కులు పడుతున్నాయి. స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎంతో మందితో కలిసి నటించిన సత్య రాజ్‌ కూతురు గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సత్యరాజ్ కి కొడుకు సిబిరాజ్, కూతురు దివ్య ఉన్నారు. ఇప్పటికే సత్యరాజ్ తనయుడు సిబిరాజ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. డోరా, మయోన్‌ సినిమాల్లో హీరోగా నటించడం ద్వారా తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. హీరోగా సిబిరాజ్ సక్సెస్‌ను దక్కించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే ఆయన కూతురు గురించి సైతం చర్చ జరుగుతోంది. కూతురు దివ్య ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆమెకు నటించే అవకాశాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించాని తమిళ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

దివ్య మొదటి నుంచి నటనపై ఆసక్తిని కనబరచలేదు. తనకు ఆసక్తి ఉంటే నటించేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా గతంలో ఒక ఇంటర్వ్యూలో సత్యరాజ్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సత్యరాజ్ కుమార్తె దివ్య ఇండస్ట్రీకి దూరంగా న్యూట్రిషియన్‌ గా కెరీర్‌ లో ముందుకు సాగుతుంది. ఆమె కెరీర్‌ లో విజయాలు సొంతం చేసుకుంటూ బాగానే ఉన్నారు. దివ్య సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా హెల్త్‌ కి సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తూ బాగానే ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా దివ్య చూడ్డానికి చాలా అందంగా, హీరోయిన్‌ మాదిరిగా ఉంటారు. సినిమాల్లో ప్రయత్నిస్తే నటిగా మంచి ఫ్యూచర్‌ ఉండేది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News