యానిమల్.. పుష్ప 2.. ఎవరీ సౌరబ్..?

సౌరబ్ సచ్దేవ.. ఈ పేరు ఎవరికీ తెలియదు కానీ యానిమల్ సినిమాలో బాబీ డియో బ్రదర్ గా నటించాడంటే గుర్తు పడతారు.

Update: 2025-01-04 15:30 GMT

సౌరబ్ సచ్దేవ.. ఈ పేరు ఎవరికీ తెలియదు కానీ యానిమల్ సినిమాలో బాబీ డియో బ్రదర్ గా నటించాడంటే గుర్తు పడతారు. అ సినిమా సూపర్ హిట్ కాగా అందులో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వచ్చింది. యానిమల్ సినిమానే కాదు ఈమధ్యనే రిలీజై పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పుష్ప 2 సినిమాలో కూడా సౌరబ్ సచ్దేవ్ నటించాడు. పుష్ప 2 లో ఎక్కడా అని ఆశ్చర్యపోవచ్చు.. పుష్ప రాజ్ 2000 టన్నుల సరుకు తెస్తానని మాల్దీవ్స్ వెళ్లి డీల్ చేసుకుంటాడు.

ఆ డీల్ చేసే బిగ్ షాట్ పాత్రలో నటించిన సౌరబ్ సచ్దేవ్ నటించాడు. ఇంకా డీటైల్డ్ గా చెప్పాలంటే కుక్క పిల్లని చేతిలో పెట్టుకుని 2000 టన్నుల డీల్ సెట్ చేసే బిగ్ షాట్ పాత్రలో నటించింది అతనే. యానిమల్, పుష్ప 2 ఈ రెండు బ్లాక్ బస్టర్ సినిమాల్లో సౌరబ్ నటించాడు. ఐతే సౌరబ్ గురించి మన తెలుగు ఆడియన్స్ కు తెలియని మరో స్పెషాలిటీ ఏంటంటే అతనొక యాక్టింగ్ ట్రైనర్.. నటీనటులకు యాక్టింగ్ కోర్స్ నేర్పిస్తుంటాడు.

బాలీవుడ్ లో యాక్టింగ్ కోచ్ గా అతనికి మంచి పేరు ఉంది. ఐతే ఎంతమందికి యాక్టింగ్ నేర్పించినా అదంతా తెర వెనకే. తెర మీద కనిపిస్తేనే అతనికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. అందుకే సౌరబ్ సచ్దేవ తెర మీద కనిపిస్తూ వస్తున్నాడు. అతను చేసే పాత్రలు చాలా సింపుల్ గా ఉంటున్నాయి. ఐతే యానిమల్ సినిమాలో సౌరబ్ పాత్ర అలరించింది. ఈమధ్య ఆయన యానిమల్ 2 లో కూడా తన రోల్ ఉంటుందని చెప్పాడు.

రణ్ బీర్ కపూర్, సందీప్ వంగ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఐతే యానిమల్ సినిమా లో నటించిన సౌరబ్ సచ్దేవ ఇటు పుష్ప 2 లో కూడా కనిపించే సరికి ఆడియన్స్ అతన్ని గుర్తు పడుతున్నారు. నటులకు ట్రైనింగ్ ఇస్తూనే చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్న సౌరబ్ కి సరైన పాత్ర పడితే తన టాలెంట్ చూపిస్తాడని చెప్పొచ్చు.

Tags:    

Similar News