ఇండస్ట్రీ గురించి కమ్ములా మనసులో మాట!
ఆ సంగతి ఆయన మాటల్లోనే..`ఈ సుదీర్ఘ ప్రయాణం నాకెంతో గర్వంగా అనిపిస్తుంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా చిత్రాల శైలి గురించి చెప్పాల్సిన పనిలేదు. డీసెంట్ చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. `లీడర్` నుంచి `లవ్ స్టోరీ` వరకూ ఎన్నో వైవిథ్యమైన చిత్రాలతో తనకంటూ ఓశైలి ఉందని నిరూపించిన దర్శకుడు. సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడం ఆయనకే చెల్లింది. తాజాగా దర్శకుడిగా ఆయన ప్రయాణానికి 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన ప్రయాణం...పరిశ్రమలో స్టగుల్స్ గురించి ఉద్దేశించి తన మనసులో భావాలు తొలిసారి బయటపపెట్టారు.
ఆ సంగతి ఆయన మాటల్లోనే..`ఈ సుదీర్ఘ ప్రయాణం నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ప్రపంచం క్రూరమైనది. నిత్యం కఠినమైన సవాళ్లుతో నిండి ఉంటుంది. ఇక్కడ సక్సెస్ ఇస్తే పైన ఉంటాం. లేకపోతే పాతాళంలో ఉంటాం. ఆర్దికంగా నేను మరీ అంత బలవంతుడిని కాకపోయినా ఇలాంటివన్నీ ఎదుర్కుని ఎక్కడా రాజీ పడకుండా నా సిద్దాంతాలతో సినిమాలు చేస్తున్నాను. వాటితో అందర్నీ మెప్పించి స్థిరంగా ఉన్నందుకు గర్వంగా ఉంది.
ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు సమాజంపై ప్రతికూలతో చూపించే అంశాలేవి లేకుండా చూసుకు న్నానన్నది ఎక్కువ సంతృప్తినిస్తుంది. ఈ 25 ఏళ్లలో పేరు కోసమే..డబ్బు కోసమో ఎప్పుడూ ఏ సినిమా తీయలేదు. నాకు నచ్చిన నచ్చిన కథని నాకు తోచిన విధంగా తీసి ఎంతో ఫ్యాషన్ తో పనిచేసాను. అది కూడా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది` అని అన్నారు. అయితే ఈ 25 ఏళ్లలో ఆయన చేసింది చాలా తక్కువ సినిమాలే.
కేవలం పది సినిమాలు మాత్రమే చేసారు. వంద చేయడం కంటే నిక్కమైన నీలంమొక్కటి చాలు అన్న పద్దతిలో ఆయన సినిమాలు చేసారు. తొలి సినిమా `డాలర్ డ్రీమ్స్` . అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత `ఆనంద్` లాంటి మంచి కాఫీ సినిమా అందించాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. `లీడర్` ..`హ్యాపీడేస్` లాంటి సినిమాలు స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` ..`అనామిక` పెద్దగా ఆడలేదు. అప్పుడే మళ్లీ `ఫిదా`తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. `లవ్ స్టోరీ`తో అదే సక్సెస్ ని కంటున్యూ చేస్తున్నారు. ప్రస్తుతం తనశైలికి భిన్నంగా ధనుష్..నాగార్జునలతో `కుభేర` అనే గ్యాంగ్ స్టర్ సినిమా చేస్తున్నారు.