శేఖర కమ్ముల.. ఇది పర్ఫెక్ట్ సీక్వెల్
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా కంప్లీట్ క్లాస్ టచ్ తో శేఖర్ కమ్ముల లీడర్ మూవీని తెరపై ఆవిష్కరించారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా లీడ్ రోల్ లో వచ్చిన లీడర్ క్లాసిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా కంప్లీట్ క్లాస్ టచ్ తో శేఖర్ కమ్ముల లీడర్ మూవీని తెరపై ఆవిష్కరించారు. సైలెంట్ గా ఈ మూవీ జనాల్లోకి వెళ్ళిపోయింది. అప్పట్లో సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా ప్రస్తుతం లీడర్ లో క్లైమాక్స్ సాంగ్ రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటూ ఉంటాయి.
మూవీ కూడా జనాలని బాగా ప్రభావితం చేసింది. 2010లో ఈ సినిమా వచ్చింది. రానా హీరోగా పరిచయం అయ్యింది ఆ సినిమాతోనే. లీడర్ తర్వాత మరల ఆ స్థాయిలో హీరోయిజం ఉన్న పాత్రని చేయడానికి రానాకి చాలా టైం పట్టింది. మళ్ళీ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబలిలో విలన్ గా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. టాలీవుడ్ లో మిగిలిన హీరోలకి భిన్నంగా రానా కథల ఎంపిక ఉంటుందని ఆయన కెరియర్ చూస్తేనే తెలుస్తుంది.
మరల 14 ఏళ్ళ తర్వాత లీడర్ సీక్వెల్ చేయడానికి శేఖర్ కమ్ముల సిద్ధం అవుతున్నాడంట. ఏషియన్ సినిమాస్ - శ్రీ వెంకటేశ్వర సినిమాస్ కాంబినేషన్ పై శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మూవీ చేశాడు. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ధనుష్, కింగ్ నాగార్జునతో ఒక బైలింగ్వల్ మూవీని వారి బ్యానర్ లో శేఖర్ కమ్ముల చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ తిరుపతి పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఈ సినిమా తర్వాత కూడా అదే కలయికలో మరో సినిమా చేయడానికి శేఖర్ కమ్ముల సైన్ చేశాడు. ఇది లీడర్ మూవీకి సీక్వెల్ అని తెలుస్తోంది. రానా హీరోగానే ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు టాక్. ఇప్పటికే రానాకి కథ కూడా శేఖర్ కమ్ముల నేరేట్ చేసారంట. ఆయనకి నచ్చడంతో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ధనుష్, నాగార్జునతో చేస్తోన్న మూవీ రిలీజ్ అయిన వెంటనే లీడర్ సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రానా చివరిగా అరణ్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. 1945 అనే సినిమా ఒకటి చేశాడు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. తేజ దర్శకత్వంలో మూవీ చేయడానికి రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.