కోవై సరళ ఒంటరి జీవితం ఎందుకంటే!
హాస్య నటి కోవై సరళ గురించి పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ నటి అయినా తెలుగులో ఎంతో ఫేమస్. బ్రహ్మానందం-కోవై సరళ కామెడీ ట్రాక్స్ తెలుగు ప్రేక్షకులకు అంత దగ్గర చేసింది.
హాస్య నటి కోవై సరళ గురించి పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ నటి అయినా తెలుగులో ఎంతో ఫేమస్. బ్రహ్మానందం-కోవై సరళ కామెడీ ట్రాక్స్ తెలుగు ప్రేక్షకులకు అంత దగ్గర చేసింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. నటనలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఉందని నిరూపించిన నటి. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లి తెరపైనా రాణిస్తున్నారు. ఇలా నటిగా ఆమె జీవితం పరిపూర్ణం.
అయితే వ్యక్తిగత జీవితంలో ఆమె ఇంకా సింగిల్. ఆమె వయసు 61 ఏళ్లు. పెళ్లి చేసుకోలేదు. పేరు ప్రఖ్యాతలు..కీర్తి ప్రతిష్టలు..గొప్ప విజయాలు ఉన్నా! వివాహ బంధానికి మాత్రం ఆమె దూరంగా ఉన్నారు. తన కుటుంబంలో ఆమె పెద్ద ఆవిడ. కోవై సరళ తర్వాత నలుగురు చెల్లెళ్లు ఉన్నారుట. తన సంపాదనంతా కుటుంబానికే పెడతారుట. స్వార్ధం ఎరుగని మనిషి. చెల్లెళ్లు అందరికీ దగ్గరుండి పెళ్లిళ్లు చేసింది.
చివరికి వారికి పుట్టిన పిల్లల బాధ్యతలు కూడా ఆమె తీసుకున్నారుట. సొంత డబ్బుతోనే వాళ్లని చదవించారుట. ఇప్పుడు మనవరాళ్లను కూడా చూసుకుంటున్నారుట. అంతేనా సేవా కార్యక్రమాల్లోను సరళ ముందుంటారని తెలుస్తోంది. ఆపదలో ఉన్నవారికి...నిరుపేదలకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తుంటారుట. ఇక ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి కారణం చెల్లెళ్ల గురించి ఎక్కువగా ఆలోచించడం అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. వాళ్ల జీవితాలకు మార్గం వేసే క్రమంలో సరళ జీవితాన్ని త్యాగం చేసిందని తెలుస్తోంది. అయితే వివాహ బంధం కంటే ఒంటరి జీవితాన్నే ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంటారుట.
అలాంటి జీవితం అలవాటైపోయి కాదు...చిన్న నాటి నుంచి కోవై సరళ స్వతంత్రంగా ఉండాలి అనే భావన బలంగా ఉండేదిట. ఆ సంకల్పంతోనే జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఎంజీఆర్ స్పూర్తితో ఆమె సినిమాల్లోకి వచ్చారు. కోవై సరళ పదో తరగతి చదువుతోన్న సమయంలో గర్బీణి పాత్ర పోషించారు. ఆ వయసులో ఇలాంటి పాత్ర పోషించాలంటే ఎంతో ఆలోచిస్తారు. కానీ నటనపై మక్కువతో మరో ఆలోచన లేకుండా ఆ పాత్ర పోషించి సినిమాలపై తన ఫ్యాషన్ చాటుకున్నారు.