అలెర్ట్: సెప్టెంబ‌ర్ మాసం.. స‌రైన సినిమాలొస్తున్నాయ్

ఈ పెప్పీ రొమాంటిక్ నంబ‌ర్ ఈ వ‌ర్షాల సీజ‌న్ కి ప‌ర్ఫెక్ట్ గా యాప్ట్. సెప్టెంబ‌ర్ నెల‌లో రానున్న డ‌జ‌ను సినిమాల న‌డుమ‌ రెయినీ సీజ‌న్

Update: 2023-08-26 19:24 GMT

సెప్టెంబ‌ర్ మాసం.. సెప్టెంబ‌ర్ మాసం.. పాత బాధ‌లు త‌లెత్త‌నివ్వం...అక్టోబ‌ర్ మాసం.. అక్టోబ‌ర్ మాసం.. కొత్త బాధ‌లు త‌లెత్తుకున్నాం..! మ‌ణిర‌త్నం 'స‌ఖి' సినిమాలోని పాట ఇది. ఈ పెప్పీ రొమాంటిక్ నంబ‌ర్ ఈ వ‌ర్షాల సీజ‌న్ కి ప‌ర్ఫెక్ట్ గా యాప్ట్. సెప్టెంబ‌ర్ నెల‌లో రానున్న డ‌జ‌ను సినిమాల న‌డుమ‌ రెయినీ సీజ‌న్ మ‌జాను ఆస్వాధించేలా తొలిగా 01సెప్టెంబ‌ర్ 2023న దేవ‌ర‌కొండ‌-సమంత జంట న‌టించిన ఖుషీ విడుద‌ల‌వుతోంది.

ఇది రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్. స‌మంత‌- విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య రొమాన్స్ ఒక రేంజులో పండింద‌ని ఇప్ప‌టికే పోస్ట‌ర్లు టీజ‌ర్లు, ట్రైల‌ర్ వెల్ల‌డించాయి. అయితే భార్యాభ‌ర్త‌ల న‌డుమ గొడ‌వ అనే కాన్‌ఫ్లిక్ట్ తో ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ త‌న‌దైన మార్క్ ని చూపించ‌బోతున్నాడు.

ఆ త‌ర్వాత కూడా అనుష్క - న‌వీన్ పోలిశెట్టి జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఫ‌న్ ఎంట‌ర్ టైన‌ర్ - మిస్ శెట్టి శ్రీమతి పోలిశెట్టి విడుద‌ల కానుంది. సెప్టెంబర్ 07 న వ‌స్తున్న ఈ సినిమాలో పెళ్లితో ప‌ని లేకుండా బిడ్డ‌ను క‌నాల‌నుకునే మోడ్ర‌న్ అమ్మాయిగా అనుష్క శెట్టి న‌టించింది. పోలిశెట్టి న‌ట‌న, ఫ‌న్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం కానున్నాయి. యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో రూపొందిన ఈ చిత్రానికి మ‌హేష్‌బాబు.పి ద‌ర్శ‌కుడు.

రామ్ పోతినేని స్కంద సెప్టెంబర్ 15న విడుద‌ల కానుంది. బోయ‌పాటి లాంటి మాస్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన ఈ సినిమాలో రామ్ మాసిజం ఏ రేంజులో వ‌ర్క‌వుట్ కానుందో ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు ప్రోమోలు వెల్ల‌డించాయి. నేటి సాయంత్రం విడుద‌లైన ట్రైల‌ర్ అభిమాను ఆక‌ట్టుకుంది. ఇక ఈ మూవీలో రామ్ - శ్రీ‌లీల జంట ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు రొమాన్స్ మాస్ ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్ గా నిల‌వ‌నున్నాయ‌ని భ‌రోసా ఉంది. శ్రీ‌నివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇదే నెల‌లో రామ్ స్కంధ‌తో పోటీప‌డుతూ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన టిల్లూ స్క్వేర్ విడుద‌ల‌వుతోంది. సెప్టెంబ‌ర్ 15 రిలీజ్ తేదీని ఫిక్స్ చేసుకుంది ఈ చిత్రం. డీజే టిల్లు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ప్రీవిజువ‌ల్స్ ఆక‌ట్టుకున్నాయి. సిద్ధు మ‌రో హిట్టు కొడ‌తాడ‌ని అంతా భావిస్తున్నారు.

వీట‌న్నిటి న‌డుమా సెప్టెంబ‌ర్ లోనే బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌డానికి వ‌స్తున్న సినిమాలుగా ప్ర‌భాస్ స‌లార్ .. షారూఖ్ జ‌వాన్ చిత్రాల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ ల కోసం భారీ ప్రిప‌రేష‌న్ తో ఉన్నాయి. 07 సెప్టెంబ‌ర్ జ‌వాన్ విడుద‌లకు ముహూర్తం ఫిక్స్ చేయ‌గా.. అంత‌కుమించి భారీ అంచ‌నాల‌తో స‌లార్ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ రెండు చిత్రాలు ఒక‌దానిని మించి ఒక‌టి రికార్డుల‌తో సెప్టెంబ‌ర్ ని వేడెక్కిస్తాయ‌ని అంతా భావిస్తున్నారు.

జ‌వాన్ అట్లీ మార్క్ మాస్ యాక్ష‌న్ సినిమా. స్పై క‌థాంశంతో రూపొందింది. ప్ర‌భాస్ స‌లార్ క‌థాంశాన్ని ఎక్కువ‌గా రివీల్ చేయ‌ని ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ని మించిన భారీ యాక్ష‌న్ తో తెర‌కెక్కించార‌న్న టాక్ ఉంది. టీజ‌ర్ గ్లిమ్స్ వెబ్ లో సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో స‌లార్ పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. మ‌రో 30రోజుల్లో రానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. మార్క్ ఆంటోనీ 15 సెప్టెంబర్ విడుద‌ల‌వుతుంటే .. కంగ‌న న‌టించిన చంద్రముఖి2 కూడా ఇదే సెప్టెంబర్ లో విడుద‌ల కానుంది.

హిందీ సినిమాకి ఆగస్ట్ ఒక ఉత్తేజకరమైన నెలగా మారింది. గదర్ 2 మరియు OMG 2 ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాయి మరియు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. ప్రేక్షకులు మళ్లీ సినిమాల వద్దకు వచ్చారు మరియు చిత్రనిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేయడానికి ఇది గొప్ప సమయం. సెప్టెంబర్ నెలలో చాలా సినిమాలు థియేటర్లలో మరియు OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలవుతాయి. క్రింద వాటిని తనిఖీ చేయండి!

బాలీవుడ్ నుంచి టాప్ 5 సినిమాలు: బాలీవుడ్ నుంచి ఐదారు చిత్రాలు ఈ సెప్టెంబ‌ర్ లో క్రేజీగా విడుద‌ల కానున్నాయి. షారూఖ్ ఖాన్ - జ‌వాన్.. ప్ర‌భాస్ - స‌లార్ హిందీ వెర్ష‌న్లు అత్యంత భారీగా విడుద‌ల కానున్నాయి. అలాగే ఇత‌ర సినిమాలు ప్ర‌జ‌ల్లో జోష్ నింపేందుకు వ‌స్తున్నాయి. ఫ్రైడే నైట్ ప్లాన్ .. జూహీ చావ్లా, బాబిల్ ఖాన్, ఆది ఆనంద్ న‌టించిన కామెడీ డ్రామా చిత్ర‌మిది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. 1 సెప్టెంబర్ 2023 రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. సుధాన్షు శర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన స్పోర్ట్స్ చిత్రం ల‌వ్ ఆల్ సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల‌వుతోంది.

కే కే మీనన్ -స్వస్తిక ముఖర్జీ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు. రోహిత్ రాజ్, డైసీ షా, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలలో న‌టించిన‌ హిందీ థ్రిల్లర్ చిత్రం- టాటూ సీక్రెట్ సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల‌వుతోంది. గదర్ 2 నటి అమీష్ పటేల్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఇటీవల టికు వెడ్స్ షేరులో నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ న‌టించిన‌ హడ్డీ సెప్టెంబ‌ర్ 7న‌ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది క్రైమ్ డ్రామా చిత్రం. నవాజుద్దీన్ ఈ చిత్రంలో ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్నారు. అత‌డు సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారు. దీనికి ZEE5లో OTT ప్రీమియర్ చేస్తోంది.

సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వస్తున్న మిస్టరీ థ్రిల్లర్-జానే జాన్. ఈ చిత్రం కరీనా కపూర్ ఖాన్ కి తొలి OTT చిత్రం. జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ ఇందులో కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రం కీగో హిగాషినో రచించిన 2005 జపనీస్ నవల ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్‌కి అనుసరణ. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో 21 సెప్టెంబ‌ర్ తేదీన విడుదల కానుంది. విక్కీ కౌశల్ చివరిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'జరా హాట్కే జరా బచ్కే'లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యకరంగా మంచి ప్రదర్శన కనబరిచింది. విక్కీ తాజా చిత్రం - ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీలో క‌నిపించ‌నున్నాడు. మానుషి చిల్లర్ - కుముద్ మిశ్రా నటించిన ఫ్యామిలీ డ్రామాలో విక్కీ న‌ట‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్క‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 22 సెప్టెంబర్ 2023 విడుద‌ల తేదీ.

Tags:    

Similar News