స్కాచ్ విస్కీ వ్యాపారంలో స్టార్ హీరోలు బిజీ!
లాభసాటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంలో మన స్టార్ హీరోలు ఉద్ధండులు! క్రీడలు, విద్య, బేవరేజెస్, హోటల్స్ రంగంలో ఎక్కువమంది సెలబ్రిటీలు పెట్టుబడులు పెట్టారు
లాభసాటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంలో మన స్టార్ హీరోలు ఉద్ధండులు! క్రీడలు, విద్య, బేవరేజెస్, హోటల్స్ రంగంలో ఎక్కువమంది సెలబ్రిటీలు పెట్టుబడులు పెట్టారు. బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్, సంజయ్ దత్ ఈ తరహా వ్యాపారాల్లో తలమునకలుగా ఉన్నారు. సంజయ్ దత్ గతంలో వందల కోట్లు స్కాచ్ విస్కీ తయారీ పరిశ్రమలో పెట్టుబడిగా పెట్టానని తెలిపారు.
విస్కీ వ్యాపారంలో తాము కూడా ఉద్ధండులమని నిరూపిస్తున్నారు షారూఖ్- ఆర్యన్ ఖాన్ జోడీ. ఈ తండ్రి కొడుకులు తెలివైన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ ఎంటర్ ప్రెన్యూర్లుగా సత్తా చాటుతున్నారు. వందల వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను నడిపిస్తున్నారు. షారూఖ్- ఆర్యన్ ఖాన్ విస్కీ బ్రాండ్ D'YAVOL, 2024 న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్ (NYWSC)లో `వరల్డ్స్ బెస్ట్ స్కాచ్ విస్కీ` అనే ప్రతిష్టాత్మక బిరుదును సంపాదించింది. ఖాన్ ల ఫ్లాగ్‌షిప్ సమర్పణలో ఇన్‌సెప్షన్- బెస్ట్ ఓవరాల్ స్కాచ్, బెస్ట్ ఆఫ్ క్లాస్ బ్లెండెడ్ మాల్ట్ స్కాచ్ విస్కీగా గుర్తింపు దక్కింది. ఇది ప్రపంచ స్థాయి స్ఫూర్తిగా బ్రాండ్ హోదాను సుస్థిరం చేసింది. ది టేస్టింగ్ అలయన్స్ హోస్ట్ చేసిన NYWSC అనుభవజ్ఞులైన పరిశ్రమ నిపుణుల ప్యానెల్ ఈ తీర్పును వెలువరించింది. నాణ్యతలో ఖాన్ ల డియావోల్ బ్రాండ్ అత్యుత్తమమైనదని నిపుణుల ప్యానెల్ ధృవీకరించింది.
మరోవైపు స్టార్ సంజయ్ దత్ ఆదాయ ఆర్జనకు సహకరిస్తున్న ప్రధాన వ్యాపారం విస్కీ వ్యాపారం. భాయ్ సంజయ్ దత్ భారతదేశంలోని మద్యం బ్రాండ్ల శ్రేణిని దిగుమతి చేసుకోవడం రిటైల్ వ్యాపారం చేయడం లక్ష్యంగా కార్టెల్ & బ్రోస్ అనే ఆల్కోబెవ్ (ఆల్కహాలిక్ బెవరేజ్) స్టార్టప్ లో పెట్టుబడి పెట్టారు. స్టార్టప్ ప్రారంభ సమర్పణ గ్లెన్ వాక్- స్కాట్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న మిశ్రమ స్కాచ్ విస్కీ. ఫ్యూచర్ ప్లాన్ లలో వోడ్కా- టేకిలా- సింగిల్ మాల్ట్ బ్రాండ్‌లను పరిచయం చేసారు. సంజయ్ దత్ ఆల్కోబెవ్ స్టార్టప్ కార్టెల్ & బ్రదర్స్ లో పెట్టుబడి పెట్టాడు. భారతదేశంలో మద్యం పోర్ట్‌ఫోలియోను అతడు విస్తరిస్తున్నాడు. లిక్కర్ రిటైల్ చైన్ లివింగ్ లిక్విడ్జ్ వెంచర్ ప్రమోటర్ ఐదుగురు భాగస్వాములలో ఒకరైన మోక్ష్ సాని- కంపెనీ స్కాట్లాండ్ లో ఫ్యాక్టరీ లీజు తీసుకున్నారు. యువ వినియోగదారుల విస్తృత స్థావరమైన భారతదేశంలోకి లిక్కర్ ని విరివిగా అందుబాటులో ఉండేలా చేయడం కంపెనీ లక్ష్యం. ఉత్పత్తులకు సరసమైన ధరను అందించడం లక్ష్యం. ఇందులో దత్ పెట్టుబడి వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రతి వ్యాపారంలో నిబంధనలు ఉన్నప్పటికీ భారతదేశంలోని యువ జనాభా మద్యపానీయాలతో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉందని కంపెనీ విశ్లేషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆల్కహాల్ మార్కెట్ లలో ఒకటిగా భారతదేశం హోదా సాధించింది. స్కాచ్ విస్కీ అసోసియేషన్ (SWA) నుండి ఇటీవలి డేటా వాల్యూమ్ పరంగా UK అతిపెద్ద స్కాచ్ విస్కీ మార్కెట్ కాగా.. భారతదేశం ఫ్రాన్స్ ను అధిగమించిందని సూచిస్తుంది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2022లో స్కాచ్ విస్కీ దిగుమతి గణనీయంగా 60 శాతం పెరిగింది.