భర్తపై భరణం కేసులో గెలిచిన ముస్లిమ్ మహిళ కథ!
అతడు మరో వివాదాస్పద, రియలిస్టిక్ స్టోరి.. కఠినమైన కోర్టు కేసు - షా బానో బేగం కేసు ఆధారంగా ఒక చిత్రాన్ని రూపొందించారు. ఆయనే దీనికి దర్శకరచయిత.
నిజ జీవితకథలను, వివాదాస్పద అంశాలను టచ్ చేయాలంటే గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ తనకు ఉన్నాయని నిరూపించారు సుపర్ణ్ ఎస్ వర్మ. ది ఫ్యామిలీ మ్యాన్, రానా నాయుడు, ది ట్రయల్, సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ, సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై వంటి వెబ్ షోల విజయం వెనక జాతీయ అవార్డ్ గ్రహీత సుపర్ణ్ ఎస్ వర్మ కలం బలం, దర్శకత్వ ప్రతిభ కూడా ఉంది. ఇవన్నీ కొంత వివాదాస్పద అంశాలను టచ్ చేసి రూపొందించినవే. అతడు మరో వివాదాస్పద, రియలిస్టిక్ స్టోరి.. కఠినమైన కోర్టు కేసు - షా బానో బేగం కేసు ఆధారంగా ఒక చిత్రాన్ని రూపొందించారు. ఆయనే దీనికి దర్శకరచయిత.
షా బానో బేగం vs మొహమ్మద్ అహ్మద్ ఖాన్ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. సాధారణంగా షా బానో బేగం కేసు అని దీనిని ప్రజలు పిలుస్తారు, స్వాతంత్య్రం తర్వాత భారతదేశంలో ఒక మైలురాయిగా పరిగణించిన టాపిక్ ఇది. దీనిని 1978లో షా బానో భర్త మొహమ్మద్ తో కోర్టులో పోరాటం సాగించారు. అహ్మద్ ఖాన్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 123 ప్రకారం తనకు తన ఐదుగురు పిల్లలకు భరణం ఇవ్వాలని 65ఏళ్ల షాబానో కోరింది. షా బానో ఈ కేసును గెలుపొందారు. తీర్పు ఇస్లామిక్ చట్టానికి విరుద్ధమని ఒక వర్గం ప్రజలు విశ్వసించడం కలకలం రేపింది. ఇది భారతదేశంలోని వివిధ మతాలకు వేర్వేరు సివిల్ కోడ్‌లను కలిగి ఉండటంపై చర్చకు దారితీసింది తీర్పు వెలువడిన 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ చర్చ కొనసాగుతోంది.
సుపర్ణ్ ఎస్ వర్మ ఈ రియలిస్టిక్ స్టోరి తాలూకా స్క్రిప్ట్‌ను లాక్ చేసి, నటీనటులు, సిబ్బందిని ఖరారు చేసే పనిలో ఉన్నారు. షా బానో బేగం కేసుపై తీసిన రియలిస్టిక్ సినిమా నేటి తరానికి చాలా ముఖ్యమైనదని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే అది మహిళా సాధికారత తాలూకా వైభవాన్ని ఆవిష్కరించే సినిమా.