అర్జెంట్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికాకు స్టార్ హీరో
ఇటీవల వరుస విజయాలతో కింగ్ ఖాన్ షారూఖ్ కంబ్యాక్ లో అదరగొట్టాడు.
ఇటీవల వరుస విజయాలతో కింగ్ ఖాన్ షారూఖ్ కంబ్యాక్ లో అదరగొట్టాడు. ఇక అన్నీ శుభశకునములే! అంటూ అభిమానులు జోష్ మీద ఉన్నారు. ఖాన్ తదుపరి వరుసగా భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు. తదుపరి కుమార్తె సుహానాతో కలిసి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే అతడు చికిత్స కోసం విదేశాలకు వెళుతున్నారన్న వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
తమ ఫేవరెట్ షారూఖ్ ఖాన్‌కు అత్యవసరంగా కంటి చికిత్స అవసరమని, అర్జెంట్ గా నేటి ఉదయం అమెరికా వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. SRK కొంత కాలంగా కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చూపు మందగించడంతో స్థానికంగా క్లినిక్ కి వెళుతున్నారు. ఒక టాప్ కంటి సర్జన్‌ను సంప్రదించారు. అయినా అతడి కంటి సమస్య మెరుగవ్వలేదు. చికిత్స జరిగినా చూపు మరింత దెబ్బతినడంతో అతడిని అమెరికాలోని ఆసుపత్రికి తరలించమని డాక్టర్లు సలహా ఇచ్చారు. షారూఖ్‌తో పాటు అతడి భార్య గౌరీఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ అమెరికా వెళ్లనున్నారని తెలుస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో కోల్‌కతాలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ని వీక్షించిన తర్వాత హీట్ స్ట్రోక్‌కు గురైనప్పుడు షారూఖ్ హెడ్ లైన్స్ లోకొచ్చాడు. అయితే ఈ కంటి సమస్య అకస్మాత్తుగా వచ్చినట్టు కనిపిస్తోంది. అతడి వయసును కూడా ఈ సందర్భంగా పరిగణించాల్సి ఉంటుంది. అయినా ఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. షారూఖ్ భవిష్యత్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను అలరించాల్సి ఉంది. దానికోసం ఎంతో ఉత్సాహం నెలకొంది.