బాలీవుడ్ బాక్సాఫీస్ సందడి.. బౌన్స్ బ్యాక్
ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని మూడేళ్ళ క్రితం వరకు అందరినోట వినిపించే మాట.
ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని మూడేళ్ళ క్రితం వరకు అందరినోట వినిపించే మాట. అయితే రాజమౌళి బాహుబలి సిరీస్ వచ్చిన తర్వాత సౌత్ సినిమాపైన కూడా ఫోకస్ పెరిగింది. అంతర్జాతీయ వేదికపై తెలుగు, తమిళ సినిమాలు సత్తా చూపించడం మొదలు పెట్టాయి. ఓ విధంగా చెప్పాలంటే సౌత్ నుంచి బాహుబలి సిరీస్, కేజీఎఫ్ సిరీస్, ఆర్ఆర్ఆర్, కార్తికేయ, కాంతారా లాంటి సినిమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.
ఇదే సమయంలో 2020 నుంచి బాలీవుడ్ సినిమా గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ఏడాదికి హిట్ సినిమాలు కనీసం సింగిల్ డిజిట్ దాటలేని పరిస్థితి. భారీ బడ్జెట్ లతో చేస్తోన్న సినిమాలు అన్ని డిజాస్టర్ అవుతూ వచ్చాయి. ఏకంగా మూడేళ్ళ పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సరైన హిట్స్ లేవు. దీంతో బాలీవుడ్ పనైపోయింది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. వెస్ట్రన్ ఉచ్చులో చిక్కుకొని నెగిటివిటీని వదిలేసి సినిమాలు చేయడమే బాలీవుడ్ లో సినిమాల ఫెయిల్యూర్ కి కారణం.
ఈ పరిస్థితి నుంచి బాలీవుడ్ సినిమాకి ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన పఠాన్ మూవీ బూస్ట్ ఇచ్చింది. ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించింది. షారుఖ్ ఖాన్ మళ్ళీ బాలీవుడ్ సినిమాకి ఊపిరి పోశారు. తాజాగా సన్నీ డియోల్ హీరోగా వచ్చిన గద్దర్ 2 కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. మళ్ళీ షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది.
ఈ ఏడాది ఇండియన్ ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 సినిమాలలో ఇప్పటి వరకు అయితే మూడు బాలీవుడ్ వి ఉండటం విశేషం. అయితే ఈ సినిమాలు సక్సెస్ కావడానికి కారణం మాస్ మంత్ర అని చెప్పాలి. గద్దర్ 2 పంజాబ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే యాక్షన్ రివెంజ్ డ్రామాతో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. పఠాన్ మూవీ కూడా ఇండియా, దేశభక్తితో ముడిపడిన కథాంశం కావడంతో బ్లాక్ బస్టర్ హాయ్ అయ్యింది.
ఇప్పుడు షారుఖ్ జవాన్ సినిమా కథాంశం కూడా దేశభక్తితో ముడిపడిన మాస్, యాక్షన్ చిత్రం. పక్కా సౌత్ స్టైల్ లో తెరకెక్కింది. ఈ కంటెంట్ నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే సూపర్ సక్సెస్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నెగిటివిటీని నమ్ముకోవడంతోనే మళ్ళీ బాలీవుడ్ సక్సెస్ బాట పట్టిందనీయో సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జైలర్ భారీ కలెక్షన్స్ ని రాబట్టిన కూడా జవాన్ మూవీ దానిని ఐదు రోజుల్లోనే బీట్ చేసేసింది.