ఆ స్టార్ హీరోతో శంకర్ లాంటి సాహసంలా ఉందే!
ఆ సినిమా కథ పరంగా వంకలు పెట్టడానికి లేదు. కానీ విక్రమ్ ని రకరకాల ఆహార్యాల్లో చూపించే చేతులు కాల్చుకున్నారు
ఈ మధ్య కాలంలో హీరోలు రకరకాల గెటప్ ల్లో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఒకే హీరో వివిధ రకాల ఆహార్యాల్లో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగని అవి డ్యూయల్ రోల్స్ కావు. కేవలం అవి గెటప్ ల వరకే పరిమితం. అయితే ఇలాంటి ప్రయత్నాలు పెద్దగా సక్సస్ అయిన దాఖలాలు పెద్దగా లేవు. అప్పట్లో శంకర్ ఐ సినిమాతో ఇలాంటి సాహంస చేసి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. విక్రమ్ తో రకరకాల గెటప్ లు వేయించి 'ఐ' కి భారీ డిజాస్టర్ అందించారు.
ఆ సినిమా కథ పరంగా వంకలు పెట్టడానికి లేదు. కానీ విక్రమ్ ని రకరకాల ఆహార్యాల్లో చూపించే చేతులు కాల్చుకున్నారు. దీనికి ప్రధాన కారణం విక్రమ్ అసలు రూపం హైడ్ అవ్వడమే అన్నది వినిపించింది. ఆ పాత్రలో నటించే నటువెవరో తెలియకుండా చూస్తే ప్రేక్షకుడికి ఎగ్జైట్ మెంట్ ఎలా కలుగుతుందని క్రిటిక్స్ సహ ప్రేక్షకులు పెదవి విరిచేసారు. విశ్వనటుడు కమల్ హాసన్ ఈ తరహా ప్రయత్నాలు కొన్ని చిత్రాల్లో చేసి కొంతవరకూ మాత్రమే సక్సెస్ అయ్యారు. అది పరి పూర్ణం కాదు.
అలాగే అల్లరి నరేష్ కూడా 'లడ్డుబాబు' సినిమాతో ఇలాంటి ప్రయత్నం చేసి విమర్శలు ఎదుర్కున్నాడు. ఆ పాత్ర చేస్తుంది నరేష్ ? కొత్త నటుడా? సన్నగా ఉండే నరేష్ ని 200 కేజీలున్నా వ్యక్తిగా చూపించేసరికి అంతా కన్ ప్యూజన్ కి గురయ్యారు. ఆ పాత్ర చేస్తుంది నరేష్ నా? సందేహం తలెత్తింది. పాత్రలు టాన్సపర్మేష న్ పరంగా తలెత్తిన సమస్య ఇది.
తాజాగా షారుక్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ తెరకెక్కిస్తోన్న 'జవాన్' సినిమాలోనూ షారుక్ తోనూ అలాంటి సాహసం చేయించినట్లు కనిపిస్తుంది. నిన్నటి రోజును షారుక్ ఐదు గెటప్స్ లో ఉన్న మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో షారుక్ భిన్నమైన ఆహార్యాల్లో కనిపిస్తున్నారు. అలాగని ఎక్కడా ఒరిజినాల్టీని అట్లీ మిస్ చేయలేదు.
శంకర్ తరహాలో హీరోకి ఓ కొత్త రూపాన్ని ఇవ్వలేదు. షారుక్ అని తెలిసేలానే ఆ గెటప్ ల్ని తీర్చి దిద్దారు. వాస్తవానికి షారుక్ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. సినిమా మొత్తం ఆరెండు రోల్స్ ఉంటాయి. కొత్తగా వాటికి తోడు అదే షారుక్ తో అదనంగా కొత్త గెటప్స్ వేయించడం ఆసక్తికరం. మరి ఇది శంకర్ లా తప్పిదాలు దొర్లకుండా ఉంటే పర్వాలేదు. లేదంటే చేతులు కాలక తప్పదు.