ట్రెండీ టాక్: కింగ్ ఖాన్ హ్యాట్రిక్‌కి ఛాన్సుందా?

షారుఖ్ ఖాన్ ఈ సంవత్సరాన్ని పఠాన్‌తో ఘ‌నంగా ప్రారంభించాడు. హిందీ వెర్షన్ తో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల వ‌సూళ్ల‌ను సాధించిన మొదటి భారతీయ చిత్రంగా ఇది నిలిచింది.

Update: 2023-09-10 16:30 GMT

షారుఖ్ ఖాన్ ఈ సంవత్సరాన్ని పఠాన్‌తో ఘ‌నంగా ప్రారంభించాడు. హిందీ వెర్షన్ తో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల వ‌సూళ్ల‌ను సాధించిన మొదటి భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. జవాన్ దానితో సరిపోలడమే కాకుండా ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌లో ఒకటిగా దూసుకుపోతుంది. మొత్తం మీద జ‌వాన్ సాధిస్తున్న‌ కలెక్షన్లు చరిత్రాత్మకం. షారూఖ్ బ్యాక్ టు బ్యాక్ అనుకున్న‌ది సాధించుకున్నాడు.

ఈ రెండు వ‌రుస విజ‌యాల‌తో SRK వెండితెరపైకి అద్భుత‌మైన కంబ్యాక్ ని సాధించాడు. జ‌వాన్ చిత్రం తొలి మూడు రోజుల్లోనే 350కోట్లు వ‌సూలు చేసింది. ఇదే దూకుడును కొన‌సాగిస్తూ 1000 కోట్ల క్ల‌బ్ లో చేరేందుకు ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని విశ్లేషిస్తున్నారు.

అయితే కింగ్ ఖాన్ ఇదే ఏడాది హ్యాట్రిక్ విజ‌యం అందుకుంటాడా? రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన మోస్ట్ ఎవైటెడ్ చిత్రం డుంకీతో ఒకే ఏడాదిలో మూడో బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌న ఖాతాలో వేసుకుంటాడా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. డుంకీ ఈ సంవత్సరం క్రిస్మస్‌లో విడుదలకు కావాల్సి ఉండ‌గా.. నిర్మాణానంత‌ర ప‌నుల డిలే వ‌ల్ల రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతోంది. ఒక‌వేళ ఈ చిత్రం అనుకున్న ప్ర‌కారం క్రిస్మ‌స్ లోనే వ‌స్తే.. షారుఖ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 3000 కోట్లకు పైగా వసూలు చేసిన ఏకైక భారతీయ నటుడిగా రికార్డు సృష్టించగలడు. పఠాన్ - జవాన్ వారంపైగా ప్రేక్షకులను థియేట‌ర్ల‌కు ఆకర్షించగ‌లిగాయి. డుంకీలో కూడా అంత గొప్ప మ్యాట‌ర్ ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. అందుకే రాజ్ కుమార్ హిరాణీ డుంకీతో పాన్ ఇండియా హిట్టు కొడ‌తాడ‌ని 1000 కోట్ల క్ల‌బ్ సాధిస్తాడని ఊహిస్తున్నారు. ఒక‌వేల ఇదే నిజ‌మైతే ఖాన్ ఒక అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్న‌ట్టేన‌ని విశ్లేషిస్తున్నారు.

కానీ ఇది సాధ్యం కానిది. ఎందుకంటే రాజ్ కుమార్ హిరాణీ డుంకీ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి తెర‌కెక్కిస్తున్నారు. దీనికోసం రాజీకి రాకుండా ప‌ని చేస్తున్నారు. ఇప్పుడు క్రిస్మ‌స్ నాటికి సినిమా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్త‌య్యే ప‌రిస్థితి లేద‌ని అందువ‌ల్ల 2024లోనే డుంకీ రిలీజ్ సాధ్య‌మ‌వుతుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. కార‌ణం ఏదైనా కానీ డుంకీ ఈ ఏడాది విడుద‌ల కాదు. అంటే కింగ్ ఖాన్ కి అరుదైన రికార్డ్ సాధ్య‌ప‌డ‌ద‌ని చెప్పాలి.

షారుఖ్ ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు:

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ నటులలో షారుఖ్ ఖాన్ ఒకరు. 4 దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో అనేక చిరస్మరణీయమైన, ముఖ్యంగా వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలో అత‌డు భాగమయ్యాడు. తన 32 సంవత్సరాల సుదీర్ఘ సినీ కెరీర్‌లో SRK 13 బ్లాక్‌బస్టర్‌లను అందించాడు. జాబితాలోకి కొత్తగా ప్రవేశించినది జవాన్. ఈ చిత్రం కేవలం బ్లాక్ బస్టర్ మాత్రమే కాకుండా చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది. మొదటి 3 రోజుల్లోనే SRK-అట్లీ చిత్రం రూ. 380 కోట్లకు పైగా వసూలు చేసింది. ముఖ్యమైన ఆదివారం వ‌సూళ్లు క‌లుపుకుని `జ‌వాన్` ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని అంచ‌నా.

జాబితా ఇలా ఉంది:

*దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే

*కుచ్ కుచ్ హోతా హై

*కభీ ఖుషీ కభీ ఘమ్

* పఠాన్

*జవాన్

*కరణ్ అర్జున్

*దిల్ తో పాగల్ హై

*మొహబ్బతీన్

*చెన్నై ఎక్స్ప్రెస్

*రబ్ నే బనా ది జోడి

*ఓం శాంతి ఓం

*డర్

*బాజీగర్

Tags:    

Similar News