పాండే బ్యూటీ బాత్ రూమ్ భంగిమ!
తాజాగా సొగసరి మరో కొత్త ఫోటోతో నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా గ్రేకలర్ డిజైనర్ దుస్తుల్లో క్యామ్ కిచ్చిన ఫోజులు ఇంట్రెస్టింగ్.
'అర్జున్ రెడ్డి' హిట్ తో తారాజువ్వలా దూసుకొచ్చిన షాలినీ పాండే జాడిప్పుడు టాలీవుడ్ లో ఎక్కడా కనిపించని సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం 'నిశబ్దం' సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ అమ్మడు పత్తా లేదు. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తోంది గానీ అక్కడా సరైన సక్సెస్ రాలేదు. ఇటీవలే రెండేళ్ల గ్యాప్ అనంతరం 'మహారాజ్' సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది లేదు.
కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. కానీ స్టార్ కిడ్స్ వేవ్ కారణంగానూ కొన్ని అవకాశాలు కోల్పోతుంది. ఆ మధ్య షాలిని పాండే నటించాల్సిన సినిమా అన్యన్యా పాండే తన్నుకుపోయింది. ట్యాలెంట్ ఉన్నా? ఆ రకంగా కొన్ని అవకాశాలు కోల్పోతుందనే ప్రచారం ఉంది. ఇక అమ్మడి సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకుండా ఇన్ స్టాలో మాత్రం హీటెక్కిస్తుంది.
హాట్ ఫోటోలతో సెగలు పుట్టిస్తుంది. డిజైనర్ దుస్తుల్లో నాకెవ్వరూ సాటి అంటూ పోటీ పడుతుంది. తాజాగా సొగసరి మరో కొత్త ఫోటోతో నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా గ్రేకలర్ డిజైనర్ దుస్తుల్లో క్యామ్ కిచ్చిన ఫోజులు ఇంట్రెస్టింగ్. హోటల్ గదిలో వివిధ భంగిమల్లో అమ్మడు ఫోజులిచ్చింది. చివరికి ఫోటో సెషన్ కోసం బాత్ రూమ్ ని సైతం విడిచిపెట్టలేదు. బాత్ రూమ్ సింక్ పై కూర్చుని ఇచ్చిన ఫోజు అన్నింటికంటే హైలైట్.
ఈసారి అమ్మడి మ్యాకప్ డోష్ పెంచింది. మ్యాకప్ తో ఫేస్ మొత్తం రెడీష్ గా మారిపోయింది. ఐబ్రోస్..హెయిర్ స్టైల్ ప్రతీది సంథింగ్ స్పెషల్ గా హైలైట్ చేసింది. ఇక అమ్మడి రూప లావణ్యంలోనూ మార్పులు తీసుకొచ్చింది. మునుపటి కంటే మరింత సన్నజాజిలా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.