పిక్ టాక్ : బీచ్ లో పడకేసిన లేడీ సికందర్
బీచ్ లో పడకేసి అలా ఇసుక తిన్నెల్లో పడుకున్న షామా సికిందర్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
మాన్ సినిమాతో 1999 లో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ షామా సికిందర్. మొదటి సినిమాతో నటిగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. అయినా కూడా బుల్లి తెర నుంచి ఈమెకు ఆఫర్లు వచ్చాయి. అక్కడ వచ్చిన ఆఫర్లు మరియు సక్సెస్ లను సద్వినియోగం చేసుకుని ఏకంగా దశాబ్ద కాలం పాటు ఒక వెలుగు వెలిగింది.
ఈ మధ్య కాలంలో బుల్లి తెర తో పాటు వెండి తెరపై కూడా సందడికి సిద్ధం అయ్యింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. అందుకే నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల పడుచు అమ్మాయిలకు పోటీ అన్నట్లుగా అందాల ముద్దుగుమ్మ షామా సికిందర్ నెట్టింట సందడి చేస్తోంది.
తాజాగా మరోసారి షామా సికిందర్ బీచ్ ఫోటోలు షేర్ చేసి కుర్రకారును కవ్విస్తుంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ తాజా ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. బీచ్ లో పడకేసి అలా ఇసుక తిన్నెల్లో పడుకున్న షామా సికిందర్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంతటి అందం ఉన్నా కూడా ఎందుకు సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అందాల ఆరబోత విషయంలో షామా సికిందర్ పాతికేళ్ల పడుచు హీరోయిన్స్ కు గట్టి పోటి ఇస్తుంది అంటూ ఈ ఫోటోలతో తేలిపోయింది.
ఇదే స్థాయిలో అందాల ఆరబోత చేస్తే ముందు ముందు బాలీవుడ్ లేదా ఇతర భాషల సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వరుసగా రావడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించే అవకాశాలు సొంతం చేసుకోవడం ఖాయం. మరో పదేళ్ల పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి ఈ అమ్మడు అందం విషయంలో పోటీ ఇవ్వడం ఖాయం.