బుచ్చిబాబుకు శంక‌ర్ అభ‌య‌హ‌స్తం?

మ‌రోవైపు శంక‌ర్ భార‌తీయ‌డు-2ని కూడా ముగించే ప‌నిలో ఉండ‌టంతో గేమ్ ఛేంజ‌ర్ డిలే అవుతుంది.

Update: 2023-12-12 13:30 GMT

బుచ్చిబాబుకు శంక‌ర్ అభ‌యహ‌స్తం అందిస్తున్నాడా? నీ సినిమాకెలాంటి టెన్ష‌న్ లేదు? చెప్పిన టైమ్ కే చ‌ర‌ణ్ నీకు అప్ప‌గిస్తాను? అని అంటున్నారా? అంటే అవున‌నే వినిపిస్తోంది. చ‌ర‌ణ్ కథానాయ‌కుడిగా శంక‌ర్ `గేమ్ ఛేంజ‌ర్` ని ప‌ట్టాలెక్కించి రెండేళ్లు అవుతుంది. కానీ ఇంత‌వ‌ర‌కూ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది లేదు. మ‌రోవైపు శంక‌ర్ భార‌తీయ‌డు-2ని కూడా ముగించే ప‌నిలో ఉండ‌టంతో గేమ్ ఛేంజ‌ర్ డిలే అవుతుంది. అయితే ఇదంతా ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న అప్ డేట్.

తాజాగా గేమ్ ఛేంజర్ సైతం ముగింపు ద‌శ‌కే చేరుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇంకా 50 రోజుల షూటింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంద‌ని..మిగ‌తా షూట్ అంతా దాదాపు పూర్త‌యిన‌ట్లేన‌ని శంక‌ర్ అండ్ కో అంటోంది. వ‌చ్చే ఏడాది మార్చి క‌ల్లా శంక‌ర్ గేమ్ ఛేంజ‌ర్ సెట్స్ నుంచి సంపూర్ణంగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడ‌ని ... అంత‌వ‌ర‌కూ మాత్రం చ‌ర‌ణ్ వేరే ద‌ర్శ‌కుడికి దొరికే ఛాన్స్ లేద‌ని తెర‌పైకి వ‌స్తోంది.

ఎట్టి ప‌రిస్థితుల్లో చ‌ర‌ణ్ మార్చి వ‌ర‌కూ ఖాళీగా ఉండే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం శంక‌ర్ అండ్ కో చ‌ర‌ణ్ స‌హా కీల‌క న‌టీన‌టుల పై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. మ‌ద్య‌లో కొన్ని ర‌కాల విరామం క‌లుపు కుని షూటింగ్ పూర్త‌వ్వ‌డానికి 50 రోజులు స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది. అంటే బుచ్చిబాబు త‌న చిత్రాన్ని మార్చి నుంచి మొద‌లు పెట్టుకోవ‌చ్చ‌ని శంక‌ర్ సంకేతాలు పాస్ చేసిన‌ట్లు అవుతుంది.

వాస్త‌వానికి 2024 జ‌న‌వ‌రి నుంచే షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. కానీ ఇప్పుడ‌ది స‌మ్మ‌ర్ ముందుకు తీసుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే బాగా డిలే అయిన నేప‌థ్యంలో వేసవి అయినా బుచ్చిబాబు వెన‌క్కి త‌గ్గ‌డానికి ఛాన్స్ లేదు. చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో షూటింగ్ నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. అందుకే విదేశాలు వేదిక కానున్నాయ‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News