విశ్వనటుడ్ని విలన్ చేద్దామనుకున్న శంకర్!
బాలీవుడ్ నుంచి విలన్ పాత్రని తీసుకోవాలి? అనుకున్న సమయంలో చాలా మంది నటుల పేర్లు పరిశీలించారు.
స్టార్ మేకర్ శంకర్ తెరకెక్కించిన `రోబో` ప్రాంచైజీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.` రోబో`లో హీరో, విలన్ పాత్రల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ విశ్వరూపం చూపించారు. అటుపై రిలీజ్ అయిన `2.0` లో రజనీకి ధీటుగా ఖిలాడీ అక్షయ్ కుమార్ ని పక్షిరాజు గా దించి మరో సంచలనం సృష్టించాడు. పక్షిరాజు పాత్రకు అక్షయ్ కుమార్ పర్పెక్ట్ గా సూటయ్యారు. అయితే ఆ పాత్ర ఎంపిక విషయంలో శంకర్ చాలా తర్జన భర్జన పట్టాడు. బాలీవుడ్ నుంచి విలన్ పాత్రని తీసుకోవాలి? అనుకున్న సమయంలో చాలా మంది నటుల పేర్లు పరిశీలించారు.
స్క్రూట్నీ అనంతరం ఎవర్ని ఫైనల్ చేయాలో అర్దం కాలేదు. అయితే ఈ దశలో విలన్ గా విశ్వనటుడు కమల్ హాసన్ ని శంకర్ ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ రివీల్ చేసారు. `2.0` లో విలన్ గా నన్నే నటించమన్నారు. కానీ నేను ఇంకొన్నాళ్ల పాటు హీరోగానే ఉంటానని శంకర్ కి చెప్పడంతో ఆలోచన విరమించుకున్నారు. ఆ తర్వాత ఫైనల్ గా అక్షయ్ కుమార్ ని ఆ పాత్రకి ఎంపిక చేసారు.
అయితే ఇదంతా ఆరేళ్ల క్రితం నాటి మాట. నేడు అదే విశ్వనటుడు `కల్కీ 2898` కోసం విలన్ గా అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలో కమల్ పాత్ర పూర్తిగా నెగిటివ్ కోణంలో ఉంటుం దని తేలిపోయింది. పార్ట్ -2 పూర్తిగా కమల్ హాసన్ పాత్ర హైలైట్ అవుతుందని నాగ్ అశ్విన్ రివీల్ చేసాడు. తొలి భాగంలో అశ్వద్ధామ పాత్ర పోషించిన అమితతాబచ్చన్ ఓవరాల్ గా హైలైట్ అయిన సంగతి తెలిసిందే.
నెగిటివ్ పాత్రలు కమల్ కి కొత్తేం కాదు. గతంలో కొన్ని సినిమాల్లో ఆ తరహా రోల్స్ పోషించారు. అయితే అవన్నీ పాక్షికంగానే హైలైట్ అయ్యాయి. `2.0` లో నటిస్తే గనుక పూర్తి విలన్ రోల్ అవుతుంది. అందుకే కమల్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. అయితే ఇటీవల రిలీజ్ అయిన `కల్కీ 2898` లో మాత్రం అసలైన విలన్ కమల్ హాసన్ అని తెలుస్తోంది. రెండవ భాగమంతా కమల్ పాత్ర ఎక్కువగా హైలైట్ అవుతుందని నాగ్ అశ్విన్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.