101 రూపాయి పారితోషికం తీసుకున్న న‌టుడు!

బాలీవుడ్ న‌టుడు శ‌ర‌ద్ కేల్క‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే.

Update: 2024-08-31 12:30 GMT

బాలీవుడ్ న‌టుడు శ‌ర‌ద్ కేల్క‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన `స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్` సినిమాలో విలన్ గా న‌టించాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ క‌పోవ‌డంతో ఇత‌గాడు అంద‌రికీ రీచ్ అవ్వ‌లేదు. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా కూడా చేయ‌లేదు. పూర్తిగా బాలీవుడ్ లోనే బిజీ అయ్యాడు. అక్క‌డ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసి ఎంతో ఫేమ‌స్ అయ్యాడు.

`ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ లో ప్రియ‌మ‌ణికి బాస్ గా న‌టించింది ఇత‌డే. ఇటీవ‌లే రిలీజ్ అయిన `శ్రీకాంత్` బ‌యోపిక్ లో న‌టించాడు. ఆ సినిమాతో సౌత్ లో మ‌ళ్లీ అత‌డి పేరు తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఈసినిమాలో న‌టించినందుకు గానూ శ‌ర‌ద్ కేల్క‌ర్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అవును అత‌ను అక్ష‌రాల 101 రూపాయి మాత్ర‌మే రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేల్క‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసాడు. `తుషార్ శ్రీకాంత్ సినిమా డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవ్. కానీ న‌న్ను సినిమాలో ఎలాగైనా తీసుకోవాల‌ని చూసాడు. నును కూడా అప్ప‌టికే త‌ను సినిమా గురించి అడిగితే పారితోషికం ఎక్కువ అడ‌గ‌కూడ‌దు అనుకున్నాను. అంతే కాదు అత‌డు నాకు మంచి స్నేహితుడు కూడా. ఎంతో నిజాయితీ ప‌రుడు. డ‌బ్బులు లేవ‌ని ముందే చెప్పేసాడు.

ఒక‌వేళ ఉంటే నీ పారితోషికం నీకు వ‌చ్చేవాడ‌నికి..కానీ ఇక్క‌డ బడ్జెట్ నిల్ అనేసాడు. దీంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప‌నిచేయాల‌నుకున్నాను. కానీ మ‌రీ ఉచితంగా ఎందుక‌ని 101 రూపాయి తీసుకు న్నాను. కానీ నాకెంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది. కోట్ల రూపాయ‌లు తీసుకున్నా రాని సంతోషం, తృప్తినాకు ఈ సినిమా ద్వారా ల‌భించాయి. అందుకు నా స్నేహితుడికి కృత‌జ్ఞ‌తలు అని అన్నారు. తెలుగు అంధ పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ జీవిత క‌థ‌లో రాజ్ కుమార్ రావ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News