బాడీసూట్ లో హీటెక్కించిన హాట్ బ్యూటీ!
వైట్ కలర్ ఔట్ ఫిట్...స్కిన్ టోన్ ..మ్యాకప్ ...చెవులకు ధరించిన డిజైనర్ రింగులు ప్రతీది శార్వరీని మరింత అందంగా హైలైట్ చేసాయి.
శార్వీరీ వాఘ్ ఇప్పుడు బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్న పేరు. అమ్మడి జర్నీ నవతరానికి స్పూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ లో అసిస్టెట్ గా జర్నీ మొదలు పెట్టి హీరోయిన్ గా ఎదిగింది. 'బంటీ ఔర్ బబ్లీ 2 ఈ సినిమాతో నటిగా పరిచయమైంది. తొలి సినిమాతోనే అవార్డులు ..రివార్డులు సైతం దక్కించుకుంది. ఇటీవల రిలీజ్ అయిన 'మహారాజా' తోనూ మెప్పించింది.
త్వరలో 'వేదా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఇలా అమ్మడి కెరీర్ సంతోషంగా సాగిపోతుంది. ఫేం ఉన్నాప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అన్న రూల్ ని అమ్మడు బాగానే పాటిస్తుంది. కవర్ పేజీలపైనా తళుక్కున మెరుస్తుంది. తాజాగా అమ్మడు గ్రాజీయా కవర్ పేజీ పై తళుక్కున మెరిసింది. క్విల్టెడ్ బాడీసూట్ లో అమ్మడు వావ్ అనిపించింది.
వైట్ కలర్ ఔట్ ఫిట్...స్కిన్ టోన్ ..మ్యాకప్ ...చెవులకు ధరించిన డిజైనర్ రింగులు ప్రతీది శార్వరీని మరింత అందంగా హైలైట్ చేసాయి. అన్నింటి మించి శార్వరీ కళ్ల మైకంలోనే కుర్రాళ్లను ముంచేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అమ్మడి అభిమానులు బ్యూటీని పొగిడేస్తూ ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక శార్వరీ మల్టీట్యాలెంటెడ్. మంచి కథక్ ఆర్టిస్ట్. కీబోర్డు .. కిక్ బాక్సింగ్ లోనూ మంచి అనుభవం ఉంది. అమ్మడికి సినిమా బ్యాక్ గ్రౌండ్ అయితే లేదుగానీ..రాజకీయంగా తిరుగులేదు. మరాఠీ కుటుంబానికి చెందిన శార్వరీ ముంబైలో పుట్టి పెరిగింది. తన నాన్న శైలేష్ వాఘ్ రియల్ ఎస్టేట్లో బిల్డర్. అమ్మ నమ్రతా ఆర్కిటెక్. తన తాతయ్య మనోహర్ జోషి(1995-1999) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.