కాలేజీలో నేనే పెద్ద షోకిల్లానని ఫీల‌య్యేదాన్ని!

అయితే సినిమాల్లోకి రాక‌ముందు అందం విష‌యంలో తానెలా ఫీల‌య్యేది తాజాగా రివీల్ చేసింది.

Update: 2024-03-24 23:30 GMT

అన‌న్య నాగ‌ల్ల తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌ర‌చితురాలే. 'మ‌ల్లెశం' సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన యువ నాయిక అటుపై 'వ‌కీల్ సాబ్' చిత్రంలో న‌టించింది. రెండు సినిమాలు అనన్య‌కి మంచి ఐడెంటీని తీసుకొచ్చాయి. అటుపై తెలివిగా సోష‌ల్ మీడియాని ప్ర‌మోష‌న్ ప‌ర్ప‌స్ లో వాడుకుని నోన్ ఫేస్ గా ఎస్టాబ్లిష్ అయింది. అదే ఐడెంటిటీతో 'మ్యాస్ట్రో' ..'ఊర్వ‌శివో రాక్ష‌సివో'..'శాకుంత‌లం' లాంటి చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్గ్ గా ఛాన్సులు అందుకుంది. ప్ర‌స్తుతం కెరీర్ ని వ‌చ్చిన అవ‌కాశాల‌తో ముందుకు న‌డిపిస్తుంది.


అయితే సినిమాల్లోకి రాక‌ముందు అందం విష‌యంలో తానెలా ఫీల‌య్యేది తాజాగా రివీల్ చేసింది. ప‌ల్లెటూరి నేప‌థ్య‌మున్న అమ్మాయి ఇండ‌స్ట్రీలో రాణించ‌డం ఎలా? ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారితో పోటీ ని ఎదుర్కోవ‌డం ఎలా? చాలా సంగ‌తులే చెప్పుకొచ్చింది. మొదట్లో కొంత అభద్రతా భావం ఉండేది. నేను అందంగా లేనా? ఈ ఇండస్ట్రీకి సరిపోనా? అనిపించేది. కానీ తర్వాత ఆ ఆలోచనలు తగ్గిపోయాయి. దానికి కారణం నేను చేసిన పాత్రలు కావచ్చు.

కాలేజీలో ఉన్నప్పుడు- నేనే పెద్ద షోకిల్లానని అనుకొనేదాన్ని. ఇక్కడకు వచ్చిన తర్వాత అందంగా లేనా? అనే ఫీలింగ్‌ ఉండేది. అందుకే అవ‌కాశాలు రాలేదా? అనిపించేది. కానీ దక్షిణాది పాత్రలకు- ఇక్కడ అమ్మాయిలే బావుంటారని.. వారినే ప్రేక్షకులు ఆదరిస్తారని అర్థమయింది. దాంతో ఇప్పుడు నాకు ఎలాంటి అభద్రతా భావం లేదు. సంతోషంగా సినిమాలు చేయ‌గ‌ల్గుతున్నాను. సినిమా అనేది స్థిర‌మైంది కాదు. ఎప్పుడు అవ‌కాశాలు వ‌స్తాయో తెలియ‌దు..ఎన్నాళ్లు వ‌స్తాయో కూడా తెలియ‌దు.

నేను చదువు- స్థిరమైన ఉద్యోగం గురించి ఆలోచించే ప్రపంచం నుంచి వచ్చినదాన్ని. చదువుకునేదాన్ని. ఉద్యోగం చేసేదాన్ని. ఇంట్లో పని... ఇలా ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండేది కాదు. కానీ సినిమాల్లో అలా కుదరదు. కొన్నిసార్లు చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొన్నిసార్లు అస్సలు పనిలేకుండా నిరాశగా ఉంటుంది. ఈ సమయంలో అనేక అనుమానాలు వెంటాడుతూ ఉంటాయి. 'వకీల్‌సాబ్‌' తర్వాత కొంత గ్యాప్‌ వచ్చింది. ‘నేను ఉద్యోగం మానేసి రావటం సరైన పనేనా? అని నాలో నేను చాలా బాధ‌ప‌డ్డాను' అని అంది.

Tags:    

Similar News