జాన్వీ పెర్పార్మెన్స్ కి ప్రియుడు ఫిదా
రొమాంటిక్ అప్పిరియన్స్ అందర్ని ఆకట్టుకుంటుంది.
'దేవర' సినిమాతో జాన్వీకపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్నటి రోజున సినిమా దేవర పాన్ ఇండియాలో రిలీజ్ అయింది. సినిమా సక్సెస్ పుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో జాన్వీ బ్యూటీకి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. కనిపించింది కాసేపే అయినా ఊపేసింది అనే ప్రశంస అందు కుంది. రొమాంటిక్ అప్పిరియన్స్ అందర్ని ఆకట్టుకుంటుంది. తారక్ పక్కన డాన్సులతో యువతని అలరించింది.
తాజాగా జాన్వీ కపూర్ బోయ్ ప్రెండ్ శిఖర్ పహారియా సినిమా చూసి జాన్వీ నటనని ఆకాశానికి ఎత్తేసాడు. `దేవర` లోని జాన్వీ ఫోటోని షేర్ చేసాడు. నేనేమైనా కలలో ఉన్నానా? అని ఓకామెంట్ చేసాడు. ప్రస్తుతం ఆ కామెంట్ నెటిజనుల్ని ఆకర్షిస్తుంది. ఈ సందర్భంగా పహారియాకి అభిమానులు పోస్టుల వరద కురి పించారు. జాన్వీతో నీతో రిలేషన్ విషయాన్ని త్వరగా అధికారికం చేయండి? అంటూ అడగడం మొదలు పెట్టారు.
జాన్వీ-శిఖర్ పహారియా కొంత కాలంగా లవ్ లో ఉన్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు జంటగా చాలాసార్లు మీడియాకి చిక్కారు. కలిసి దేవాలయాలకు వెళ్లడం నుంచి పబ్ ల వరకూ ఇద్దరి మధ్య డీప్ బాండింగ్ కొనసాగుతుంది. ఇటీవలే అంబానీ ఇంట పెళ్లి వేడుకలో జంట రచ్చ చేసిన సంగతి తెలిసిందే. శిఖర్ పహారియా మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు.
ఇతడికి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. వ్యాపారాలు చేస్తుంటాడు. జాన్వీకి చిన్న నాటి నుంచి స్నేహితుడు. జాన్వీ తన ఇంట్లో కుటుంబ సభ్యుడిలా భావిస్తుంది. తన ఎమర్జెన్సీ కాల్ లిస్ట్ లో అతడి నెంబర్ ఉంటుందనే విషయాన్ని కరణ్ టాక్ షోలో రివీల్ చేసిన సంగతి తెలిసిందే