నెక్లెస్ పై శిఖర్ పేరు.. జాన్వీ లవ్ అధికారికం!
ఇంతలోనే శిఖర్ తో జాన్వీ ప్రేమాయణం గురించి మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది.
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ కెరీర్ జర్నీ, వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు తెలుసు. ఓవైపు కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే ప్రియుడు శిఖర్ పహారియాతో షికార్లు చేస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటికే ఈ జంట ప్రేమాయణం గురించి చాలా చర్చ సాగుతోంది. ప్రస్తుతం జాన్వీ దేవర షూటింగ్ కోసం గోవాలో బిజీగా ఉంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్‌తో మరో ప్రాజెక్ట్ RC16 కూడా లైన్లో ఉంది. ఇంతలోనే శిఖర్ తో జాన్వీ ప్రేమాయణం గురించి మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది.
శిఖర్ పహారియా ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్ కుమార్ షిండే మనవడు. జాన్వీ-శిఖర్ గతంలో రిలేషన్ షిప్లో ఉన్నారని, అది గత ఏడాది ముగిసిందని కథనాలొచ్చాయి. కానీ ఆ ఇద్దరూ తిరిగి కలిసాక మళ్లీ ప్రేమ ఊపందుకుంది. ఈ యువజంట తరచుగా కలిసి కనిపిస్తారు. జాన్వీతో విదేశాలకు షికార్ వెళ్లాడు. జాన్వీ తండ్రి బోనీ సోదరుడు అర్జున్ కపూర్లకు అతడు సన్నిహితుడు. వారితో కూడా పార్టీల్లో పోజులిచ్చాడు.
ఈ సంవత్సరం ప్రారంభంలో కాఫీ విత్ కరణ్‌లో, జాన్వీ తన స్పీడ్ డయల్ లిస్ట్‌లో అనుకోకుండా శిఖర్ని 'షికు'గా వెల్లడించి నాలుక కరుచుకుంది. ఇంతలోనే బోనీ కూడా శిఖర్ తమ కుటుంబంతో ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుందని వ్యాఖ్యానించి అగ్నికి ఆజ్యం పోసాడు.
ఇప్పుడు మరోసారి జాన్వీ ధైర్యంగా శిఖర్‌తో తన సంబంధాన్ని ధృవీకరించింది. తన తండ్రి తాజా ప్రొడక్షన్ 'మైదాన్' స్క్రీనింగ్‌కు హాజరైన జాన్వీ 'శిఖు' అని రాసిన కస్టమైజ్డ్ నెక్లెస్‌ను ధరించింది. వెన్యూ వద్ద తెల్లటి ప్యాంట్‌సూట్‌లో జాన్వీ మెరుపులు మెరిపించింది. అయితే ఈ నెక్లెస్ ఈవెంట్లో చర్చనీయాంశంగా మారింది. అభిమానులు శిఖర్ పై ఇలా బహిరంగంగా ప్రేమను కురిపించిన జాన్వీని మెచ్చుకుంటున్నారు. వారి సంబంధాన్ని అధికారికంగా నిర్ధారించినట్టేనని భావిస్తున్నారు.