స్టార్‌ హీరోకు కోర్ట్‌ షాక్‌.. రూ.కోటి చెల్లించాల్సిందే

పూర్తి వివరాల్లోకి వెళ్తే వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ లో సినిమాను చేసేందుకు గాను శింబు రూ.9.5 కోట్ల ఒప్పందం ను కుదుర్చుకున్నాడు

Update: 2023-08-30 11:30 GMT

తమిళ హీరో శింబు కి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది. నిర్మాత కరోనా కుమార్‌ తన వద్ద రూ.4.5 కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా తీసుకున్న శింబు ఇప్పుడు సినిమా ను చేసేందుకు డేట్లు ఇవ్వడం లేదని కోర్టును ఆశ్రయించాడు. నిర్మాత కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో పాటు శింబును నిర్మాతకు కోటి రూపాయల మొత్తంను చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ లో సినిమాను చేసేందుకు గాను శింబు రూ.9.5 కోట్ల ఒప్పందం ను కుదుర్చుకున్నాడు. ఆ మొత్తం లో రూ.4.5 కోట్ల ను అడ్వాన్స్ గా ఇవ్వడం జరిగిందట. కోటి రూపాయలను బ్యాంక్ ద్వారా చెల్లించగా మూడున్నర కోట్ల రూపాయలను శింబుకు డబ్బు రూపంలో చెల్లించడం జరిగిందట.

కరోనా కుమార్‌ సినిమా ను చేసేందుకు శింబు గత కొన్నాళ్లుగా డేట్లు ఇవ్వక పోవడం వల్ల కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందట. కోర్టు లో సుదీర్ఘ విచారణ పరిశీలించిన తర్వాత మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అబ్దుల్‌ ఖుదోస్ కీలక తీర్పును ఇవ్వడం జరిగింది. బ్యాంకు ద్వారా చెల్లించిన కోటి రూపాయలను చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చారు.

మిగిలిన మూడున్నర కోట్ల రూపాయలకు సరైన ఆధారాలు లేని కారణంగా ఆ మొత్తం ను చెల్లించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా శింబు కు తెలియజేయడం జరిగింది. మద్రాస్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో వెంటనే శింబు ఆ మొత్తం ను చెల్లించాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు శింబు కానీ ఆయన సన్నిహితులు లేదా పీఆర్‌ టీమ్‌ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసు విషయంలో ఉన్నత న్యాయ స్థానానికి వెళ్తారా లేదంటే నిర్మాతతో రాజీ కుదుర్చుకుంటారా అనేది చూడాలి.

Tags:    

Similar News