70 ఏళ్ల నటుడితో 31 ఏళ్ల నటి ప్రేమలో?
ప్రముఖ బుల్లితెర నటి శివాంగి వర్మ తనకంటే పెద్ద వయసు ఉన్న నటుడు గోవింద్ నామ్ దేవ్ ని పెళ్లాడుతోందని ప్రచారం సాగుతోంది.
ప్రేమకు వయసుతో పని లేదు. లవ్ ఈజ్ బ్లైండ్.. అని నిరూపించే ఘటనలు రంగుల ప్రపంచంలో ఎన్నో చూస్తూనే ఉన్నాం. తనకంటే వయసులో చాలా పెద్ద వాడైన నటుడు మిలింద్ సోమన్ (59)ని అస్సామీ నటి అంకిత కొన్వర్ (33) పెళ్లాడింది. ఈ జంట మధ్య 26 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా కానీ, అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో జంట గురించి అదే తరహా చర్చ సాగుతోంది.
ప్రముఖ బుల్లితెర నటి శివాంగి వర్మ తనకంటే పెద్ద వయసు ఉన్న నటుడు గోవింద్ నామ్ దేవ్ ని పెళ్లాడుతోందని ప్రచారం సాగుతోంది. గోవింద్ నామ్ దేవ్ వయసు 70 .. శివాంగి వయసు 31. దాదాపు అతడిలో సగం కంటే తక్కువ వయసు. అయినా శివాంగి అతడిని పెళ్లాడేందుకు సిద్ధమవుతోందని గుసగుస వినిపిస్తోంది. దీనికి కారణం గోవింద్ నామ్ దేవ్ తో సన్నిహితంగా ఉన్న ఓ ఫోటోని శివాంగి షేర్ చేస్తూ.. ``ప్రేమకు వయసు గురించి తెలియదు.. హద్దులే లేవు!`` అనే వ్యాఖ్యను జోడించింది. ఈ ఫోటోగ్రాఫ్ చూడగానే.... చిన్న వయసు అమ్మాయి అంత సీనియర్ నటుడిని డబ్బు కోసమే ప్రేమిస్తోందంటూ నెటిజనులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రేమకు వయసుతో పని లేకపోయినా డబ్బుతో పని ఉంది! అంటూ కొందరు సెటైర్ వేస్తుండగా, డబ్బు కోసమే శివాంగి అతడితో డేటింగ్ చేస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. టీవీ నటి శివాంగిపై సోషల్ మీడియాల్లో కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
అయితే గోవింద్ నామ్‌దేవ్ చిత్రంతో పెద్ద తెరపైకి అడుగుపెడుతున్న శివాంగి తన సినిమా ప్రచారం కోసమే ఇదంతా చేస్తోందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం సదరు నటి ట్రిక్కు ప్లే చేస్తోందని, ఈ చిత్రంలో తనకంటే ఎక్కువ వయసు ఉన్నవాడితో ప్రేమలో పడే యువతిగా నటిస్తోందని నెటిజనులు ఊహిస్తున్నారు. గోవింద్ నామ్ దేవ్ తో కలిసి పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నానని కూడా శివాంగి ఇంతకుముందు ఇంటర్వ్యూలో వెల్లడించింది.