ఖుషి వల్లే ఛాన్స్ పోయిందా?
నిజానికి, ఆ ఖుషీ సినిమా హిట్ అయితే, తరువాతి సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయాలని అనుకున్నాడు.
విజయ్ దేవర కొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషీ. ఈ మూవీ మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ఈ మూవీ పేరు ప్రకటించినప్పటి నుంచి మంచి హైప్ వచ్చింది. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉండటం, విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం అన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి.
దీంతో, అందరూ మూవీ హిట్ అవ్వడం పక్కా అని అనుకున్నారు. కానీ, తీరా థియేటర్స్ కి వెళ్లి చూసేసరికి చాలా మంది పెదవి విరిచేశారు. మొదటి రోజు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా, మరుసటి రోజుకి సినిమాని యావరేజ్ అనేశారు. ఈ మూవీ తర్వాత విజయ్ కి సినిమాలు వస్తూనే ఉన్నాయి. సమంత చికిత్స కోసం అమెరికా వెళ్లిపోయింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 13 కోట్ల రేంజ్ లో నష్టాలు అయితే వచ్చినట్లు టాక్.
ఎటు వచ్చి ఈ మూవీ ఫలితం డైరెక్టర్ శివ నిర్వాణను చాలా ఇబ్బందిలో పడేసింది. శివ నిర్వాణ ఈ మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. పక్కా హిట్ అవుతుందని అనుకున్నారు. ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు కూడా. పాటలకు సాహిత్యం కూడా రాశాడు. అంత చేసినా, ఫలితం ఆయన ఊహించినట్లు రాలేదు. దీంతో, బాగా నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా శివ నిర్వాణ కెరీర్ పై పెద్ద ప్రభావం చూపించిందనే చెప్పాలి. నిజానికి, ఆ ఖుషీ సినిమా హిట్ అయితే, తరువాతి సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయాలని అనుకున్నాడు. కానీ, ఈ మూవీ రిజల్ట్ తర్వాత చరణ్ డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. ఈ లెక్కన శివ నిర్వాణ ఆశలన్నీ నిరాశలయ్యాయనే చెప్పాలి.
ఇక, మళ్లీ ఆయనకు మిడిల్ రేంజ్ హీరోలు నాగ చైతన్య, శర్వానంద్, కార్తీ లాంటి హీరోలతో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, పాన్ ఇండియా డైరెక్టర్ గా నిరూపించుకోవాలన్న ఆయన కలలు ఖుషీ నాశనం చేశాయనే చెప్పొచ్చు. ఇక, ఈ మూవీతో నిర్మాతలకు కూడా నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీల్లోకి అడుగుపెట్టనుంది.