లెహంగాలో లేలేత బ్యూటీలా కపూర్ అందం!
అయితే అమ్మడు వీలైనంత వరకూ ట్రెడీషనల్ దుస్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.
కపూర్ బ్యూటీ శ్రద్దా కపూర్ సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం కొత్త ఫోటో షూట్లతో నెటి జనుల్ని ఆకర్షించడంలో ముందుంటుంది. మార్కెట్ లో న్యూ బ్రాండెడ్ దుస్తుల్లో ఒదిగి పోతుంది. అయితే అమ్మడు వీలైనంత వరకూ ట్రెడీషనల్ దుస్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. టూ మచ్ హాట్ షో అన్నది చాలా రేర్ గా ప్రొజెక్ట్ చేస్తుంది.
తాజాగా అమ్మడు న్యూ ఫోటో ఒకటి నెట్టింట్లోకి వచ్చేసింది. బ్లష్ పింక్ కలర్ లెహంగా దుస్తుల్లో తళుక్కున మెరిసింది. డ్రెస్ కలర్ అండ్ స్కిన్ టోన్ ని మ్యాచ్ చేస్తూ ఎంపిక చేసుకున్న మెడ ఆభరణం మరింత అందాన్ని జోడించింది. చెవులకు మ్యాచింగ్ బులకాలు ధరించింది. లాంగ్ హెయిర్ స్టైల్...పెదాలపై సన్నని చిరు నవ్వు..కళ్లకు ఐటెక్స్ అన్ని కపూర్ బ్యూటీ అందాన్ని మరింత రెట్టింపు చేసాయి.
శ్రద్దాలో ఐస్ ఎప్పుడూ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటాయి. ఇది కపూర్ బ్యూటీలో వెరీ రేర్ క్వాలిటీ అనొచ్చు. వివిధ భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అభిమానులు శ్రద్దా కపూర్ బ్యూటీని అంతే ఆస్వాదిస్తున్నారు. ఇక అమ్మడి కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఇటీవలే `స్త్రీ -2` తో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుంది. స్త్రీకి సీక్వెల్ గా రూపొందిన చిత్రంలో మరోసారి తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రెండు భాగాలు మంచి విజయం సాధించడంతో స్త్రీ ప్రాంచైజీ మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిపోయింది.