ప్ర‌భాస్- బ‌న్నీతో కాద‌ని అంటుందా?

ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌ముఖ బాలీవుడ్ క‌థానాయిక టాలీవుడ్ ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రిస్తోందంటూ క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

Update: 2024-12-06 02:30 GMT

డార్లింగ్ ప్ర‌భాస్ లేదా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం వ‌స్తే కాద‌నే ద‌మ్ము ధైర్యం ఏ హీరోయిన్ కి అయినా ఉందా? ఆ ఇద్ద‌రూ దేశంలోని అతి పెద్ద పాన్ ఇండియన్ స్టార్లుగా నిరూపిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌ముఖ బాలీవుడ్ క‌థానాయిక టాలీవుడ్ ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రిస్తోందంటూ క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

తెలుగులో ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు త‌న‌ను సంప్రదించినా కానీ, స‌సేమిరా అనేస్తోంద‌నేది ఈ పుకార్ల‌ సారాంశం. తెలుగు ప‌రిశ్ర‌మ‌ను అవాయిడ్ చేసేందుకు పారితోషికం భారీగా పెంచేసి త‌న‌ను సంప్ర‌దించే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను భ‌య‌పెడుతోంద‌ట‌. ఇదంతా ఎవ‌రి గురించి అంటే.. సాహో ఫేం శ్ర‌ద్ధా క‌పూర్. ఈ అమ్మ‌డు ఇటీవ‌లే స్త్రీ 2లో న‌టించి బంప‌ర్ హిట్ అందుకుంది. అందువ‌ల్ల బాలీవుడ్ లోనే వ‌రుస అవ‌కాశాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అదే స‌మ‌యంలో టాలీవుడ్ స‌హా పొరుగు భాష‌ల నుంచి భారీ అవ‌కాశాలొస్తున్నా వాటిని తిర‌స్క‌రిస్తోంద‌ని తెలుస్తోంది.

నిజానికి `సాహో` చిత్రంలో న‌టించిన‌ప్ప‌టికి శ్ర‌ద్ధాకు అంత సీన్ లేదు. అప్ప‌ట్లో శ్ర‌ద్ధా కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో` మాత్ర‌మే. సాహో ఆఫ‌ర్ కార‌ణంగానే శ్ర‌ద్ధాకు పారితోషికం అమాంతం పెరిగింది. ఆ త‌ర్వాత కూడా కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన శ్ర‌ద్ధా అమాంతం పారితోషికాలు పెంచేసింది. ఇటీవ‌లే విడుద‌లైన హార‌ర్ థ్రిల్ల‌ర్ `స్త్రీ 3`తో మ‌రో బంప‌ర్ హిట్ అందుకున్న శ్ర‌ద్ధా ఇప్పుడు పారితోషికం విష‌యంలో చుక్క‌లు చూపిస్తోంద‌ట‌. అయితే టాలీవుడ్ నుంచి ప్ర‌భాస్- బ‌న్నీ- ఎన్టీఆర్- చ‌ర‌ణ్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఆఫ‌ర్లు ఇస్తే ఈ త‌ర‌హాలో జూమ్ చేయ‌ద‌ని కూడా భావించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News