శ్రద్దా అందాల దాడి.. స్టన్నింగ్
క్రీమ్ కలర్ శారీకి డిజైనర్ బ్లౌజ్ తో పెయిర్ చేసింది. అది కూడా స్లీవ్ లెస్ బ్లౌజ్ కావడం విశేషం.
శ్రద్ధ దాస్ ని స్పెషల్ గా పరిచయం చేయాలా? అందరికీ ఆమె సుపరిచితమే. ఎవరైనా కత్తులతో, తుపాకీలతో చంపేస్తూ ఉంటారు. కానీ, శ్రద్ధాదాస్ మాత్రం కేవలం తన అందంతోనే చంపేసేలా ఉంటుంది. మామూలుగా శ్రద్ధా దాస్ చాలా అందంగా ఉంటుంది అలాంటిది, చీర కట్టి, తన సొగసులు అన్నీ కనిపించేలా చేసిందంటే ఇంకేమైనా ఉందా కల్లోలమే. తాజాగా అదే పని చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.
హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని కెరీర్ మొదలుపెట్టిన శ్రద్ధా, చివరకు సెకండ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అందాలు ఆరబోస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పుడూ మోడ్రన్ గా మెరిసిపోయే శ్రద్ధా ఈ సారి శారీలో కనిపించి షాకిచ్చింది.
ఇక, చీరలోనూ తన అందాలతో విస్పోటనం చేసేసింది. ఎంతలా అంటే, చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. క్రీమ్ కలర్ శారీకి డిజైనర్ బ్లౌజ్ తో పెయిర్ చేసింది. అది కూడా స్లీవ్ లెస్ బ్లౌజ్ కావడం విశేషం. ఇక, ఫోటోల్లో తన సొగసులు కనిపించేలా క్లీవేజ్ షో చేసింది. ముక్కుకు ముక్కెర పెట్టుకొని, నుదిటిన బొట్టు పెట్టుకొని, చెవులకు బుట్టలతో ఓ వైపు ట్రెడిషన్ గాను, మరో వైపు అందాలను చూపిస్తూ ఆల్ట్రా స్టైలిష్ గాను కనిపించింది.
ఇక ఫోటోలు షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ గా మారిపోయాయి. లైకుల వర్షం కురుస్తోంది. కామెంట్ల గురించి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అందరూ ఆమె అందాలను పొగుడుతూనే కామెంట్స్ చేశారు. ఇక శ్రద్ధా మొన్నటి వరకు ఓ టీవీ షోలో డ్యాన్స్ ప్రోగ్రాం కి జడ్జ్ గా వ్యవహరించారు.
తాజాగా ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ ‘ది బిహార్ చాప్టర్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో ఆమె చాలా పద్దతిగా చీర కట్టుకొని కనిపిస్తున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ తో ఆమెకు ఎంత వరకు గుర్తింపు వస్తుందో చూడాలి.