ఇతర హీరోయిన్స్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ గా మనుగడ సాగించాలి అంటే వచ్చిన ప్రతి ఒక్క ఛాన్స్ ను స్వీకరించాల్సిందే

Update: 2024-01-03 06:46 GMT

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ గా మనుగడ సాగించాలి అంటే వచ్చిన ప్రతి ఒక్క ఛాన్స్ ను స్వీకరించాల్సిందే. అప్పుడప్పుడు అద్భుతమైన పాత్రలు వస్తాయి, ఎక్కువ సార్లు ప్రాముఖ్యత లేని పాత్రలు వస్తాయి. అయినా కూడా కెరీర్ లో ముందుకు సాగాలి అంటే ప్రాముఖ్యత లేని ఆఫర్లను కమిట్ అవ్వాల్సిందే.

మెజార్టీ హీరోయిన్స్‌ నాకు ఆ పాత్రే కావాలి, ఈ కథే కావాలి అని వెయిట్ చేయడం లేదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు. కానీ అతి కొద్ది మంది మాత్రం ఎంపిక చేసుకుని మరీ సినిమాలు చేస్తూ ఉంటారు. అందులో నేను ఉంటాను అంటోంది సైంధవ్‌ హీరోయిన్‌ శ్రద్దా శ్రీనాథ్‌.

జెర్సీ సినిమాతో హీరోయిన్‌ గా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగు లో ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు. చేసిన కొన్ని సినిమాలు కూడా కమర్షియల్‌ హీరోయిన్‌ తరహా పాత్రలు కాదు. తాజాగా సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.

సైంధవ్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాలు ఎక్కువ కమిట్‌ అవ్వక పోవడంకు కారణం ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో ఆమె నుంచి అనూహ్య సమాధానం వచ్చింది.

జెర్సీ తర్వాత నా వద్దకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను జెర్సీ పాత్రను మించి లేదా ఆ స్థాయి పాత్రలను చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాను. వరుసగా సినిమాలు చేయాలని నేను అనుకోలేదు. మంచి పాత్రలు మాత్రమే చేయాలని నేను అనుకుంటున్నాను.

నాకు పని కావాలంటే తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమా ఛాన్స్ లు వస్తాయి. కానీ ఏది పడితే అది చేయాలని నేను అనుకోవడం లేదు. మంచి పాత్రలు మంచి సినిమాలు చేయడం ద్వారా మాత్రమే ప్రేక్షకుల ముందుకు రావాలని నేను భావిస్తున్నాను. అందుకే తెలుగు లో ఎక్కువ సినిమాలు కమిట్ అవ్వలేదు అంది. ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి పట్టుదల ఇతర హీరోయిన్స్ లో మనం చూడగలమా అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News